ECIL Recruitment : ఈసీఐఎల్ హైదరాబాద్‌లో 200 ఉద్యోగ ఖాళీలు - నేరుగా ఇంటర్వ్యూకే వెళ్లొచ్చు..! తేదీ ఇదే
ECIL హైదరాబాద్ నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఒప్పంద ప్రాతిపదికన పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 200 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు. కేవలం ఇంటర్వ్యూల ద్వారానే వీటిని భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటిటెడ్ (ECIL), హైదరాబాద్ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 200 ఖాళీలు ఉన్నాయి.

ఈ నోటిఫికేషన్ వివరాల ప్రకారం…. TO-C - కేటగిరి 1 కింద 100 ఖాళీలు ఉండగా, TO-C కేటగిరి 2 కింద 30, TO-C కేటగిరి 3 కింద మరో 70 ఖాళిలు ఉనున్నాయి. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు బీఈ/బీటెక్/ఈసీఈ/ఈటీసీ/ ఈఈఈ/ఎలక్ట్రానిక్స్ లేదా సంబంధిత విభాగంలో ఉత్తీర్ణత పొందిఉండాలి.
ఇంటర్వ్యూలతోనే ఎంపిక…
ఈ పోస్టులకు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు పూర్తి చేయాలి.నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మెరిట్ ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత గల అభ్యర్థులు 2026 ఫిబ్రవరి 24వ తేదీ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకి వచ్చే అభ్యర్థులు అప్లికేషన్ ఫారమ్ తో పాటు సంబంధిత ధ్రువపత్రాలను జతపర్చాలి. పని చేసిన అనుభవం కూడా కలిగి ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి 30 ఏళ్లు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.25,000 నుంచి రూ.31,000 మధ్య జీతం చెల్లిస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్ - ముఖ్య వివరాలు
- అభ్యర్థులు https://www.ecil.co.in/jobopenings వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్ తో పాటు టెన్త్ మెమో ఉండాలి.
- ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లు ఉండాలి.
- పని చేసిన అనుభవం ఉంటే సంబంధిత సర్టిఫికెట్లను జత పర్చాలి.
- కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది.
- ఆధార్, పాస్ పోర్టు లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి.
- దివ్యాంగ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్ ను జతపర్చాలి.
- ఇంటర్వూ తేదీ - 24 ఫిబ్రవరి 2026( ఉదయం 9 గంటల నుంచి…)
- ఇంటర్వ్యూ జరిగే ప్రాంతం - కార్పొరేట్ లెర్నింగ్, డెవలప్ మెంట్ సెంటర్, నలంద కాంప్లెక్స్, ఈసీఐఎల్, హైదరాబాద్ - 500062.
- ఎంపిక ప్రక్రియ: విద్యా అర్హతలు, పని చేసిన అనుభవం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ - https://www.ecil.co.in/
ఈ లింక్ పై క్లిక్ చేసి నేరుగా దరఖాస్తు ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

