ఈవీలకు మారే ఉద్యోగులకు నగదు ప్రోత్సాహకాలు.. గ్రీన్ వర్క్‌ప్లేస్ దిశగా అడుగులు

హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ ఈవీలకు మారే ఉద్యోగులకు నగదు ప్రోత్సాహకాలు ప్రకటించింది. గ్రీన్ వర్క్‌ప్లేస్ దిశగా ఆ కంపెనీ అడుగులు వేస్తోంది. ప్రధాని మోదీ పిలుపుతో ముందుకొచ్చినట్టుగా ప్రకటించింది.

Published on: May 20, 2026, 17:15:55 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్‌కు చెందిన టెక్ సంస్థ అజా కన్సల్టింగ్ సర్వీసెస్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) కొనుగోలు చేసే తమ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ప్రకటించింది.

ఈవీలకు మారే ఉద్యోగులకు నగదు ప్రోత్సహకాలు
ఈవీలకు మారే ఉద్యోగులకు నగదు ప్రోత్సహకాలు

ఈవీ కార్లు కొనుగోలు చేసే ఉద్యోగులకు రూ.10 వేల ప్రోత్సాహకం, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసే వారికి రూ.5 వేల ప్రోత్సాహకం అందజేస్తామని ఆ కంపెనీ సీఈఓ ఫణిరాజ్ జలిగామ ప్రకటించారు. పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో పర్యావరణ హితమైన ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.

ఇటీవల ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయని, దాంతో ప్రధాన మంత్రి కార్‌ పూలింగ్‌ను ప్రోత్సహించడంతోపాటు పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఈవీలకు మారాలని చెప్పినట్టుగా ఫణిరాజ్ గుర్తు చేశారు. అంతేకాదు ప్రభుత్వాలు నడిపే ప్రజా రవాణా వ్యవస్థను విస్త్రృతంగా వినియోగించాలని పిలుపునిచ్చిన విషయాన్ని పేర్కొన్నారు. ఇంధన వినియోగాన్ని తగ్గించడం ద్వారా దేశ విదేశీ మారక నిల్వలను ఆదా చేయవచ్చన్నారు.

ప్రధాని విజన్‌కు అనుగుణంగా ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు సంస్థలో 'గ్రీన్ పాలసీ' /'ఈవీ పాలసీ'ను అమలు చేస్తున్నామని సీఈఓ స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణతోపాటు ఉద్యోగులు స్వచ్ఛమైన, ఇంధన పొదుపు కలిగిన రవాణా మార్గాలను ఎంచుకునేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More