ESIC Hyderabad Recruitment 2026 : హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఉన్న ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ మరియు సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. మొత్తం 67 ఖాళీలున్నాయి.
ఇంటర్వ్యూ తేదీలు…

విభాగాల వారీగా అభ్యర్థులు వేర్వేరు తేదీల్లో ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఆగస్టు 24, 25, 26, 27, 31 తేదీలలో ఈ ఇంటర్వ్యూలు ప్రక్రియ కొనసాగుతుంది. ఇంటర్వ్యూ రోజున ఉదయం 9:00 గంటల నుంచి 10:30 గంటల మధ్య అభ్యర్థులు సంబంధిత వేదిక వద్ద రిపోర్టింగ్ చేయాలని అధికారులు స్పష్టం చేశారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత వచ్చే అభ్యర్థులను ఇంటర్వ్యూ ప్రక్రియకు అనుమతించరు.
- ఫ్యాకల్టీ పోస్టులు : ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల గరిష్ట వయసు ఇంటర్వ్యూ నాటికి 69 సంవత్సరాలు మించకూడదు. నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) నిబంధనల ప్రకారం విద్యార్హతలు, అనుభవం ఉండాలి.
- సీనియర్ రెసిడెంట్ పోస్టులు : ఈ పోస్టులకు పోటీపడే అభ్యర్థుల గరిష్ట వయసు 45 సంవత్సరాలుగా నిర్ణయించారు.
అప్లికేషన్ ప్రాసెస్ ఇలా….
అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ( https://esic.gov.in/ ) నుంచి దరఖాస్తు పత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. నింపిన దరఖాస్తుతో పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, వాటి జిరాక్స్ ప్రతులు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను ఇంటర్వ్యూ వేదిక వద్ద సమర్పించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మాజీ సైనికోద్యోగులు మరియు దివ్యాంగ అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు. మిగతా అభ్యర్థులు రూ. 500లను ఇంటర్వ్యూ వేదిక వద్ద ఎస్‌బీ కలెక్ట్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది.
ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.2,59,515. అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,72,572. అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ కు రూ.1,48,263 జీతం చెల్లిస్తారు. వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
- ఇంటర్వ్యూలు నిర్వహించే వేదిక : అకాడమిక్ బ్లాక్, ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్, సనాత్‌నగర్, హైదరాబాద్.
- అధికారిక వెబ్ సైట్ - https://esic.gov.in/

ఈ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలను చెక్ చేసుకోవచ్చు