ఇటీవలే లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ ఓ వీడియోను విడుదల చేశారు. మావోయిస్టులు లొంగిపోవాలని కోరారు. పరిస్థితులు మారుతున్నాయని… దేశం కూడా మారుతోందని అభిప్రాయపడ్డారు.

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌కౌంటర్‌లో హిడ్మాతో పాటు పలువురి ప్రాణాలు పోయాయని… ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందన్నారు.
నన్ను సంప్రదించండి - మల్లోజుల
అడవిలో ఉన్న దళ సభ్యులు కూడా ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని మల్లోజుల పిలుపునిచ్చారు. లొంగిపోయే దళ సభ్యులు తనను సంప్రదించొచ్చని తెలిపారు. ఈ మేరకు తన ఫోన్ నంబర్ 8856038533 ను ప్రకటించారు.
శాంతిస్థాన కోసం విజ్ఞప్తి చేసిన మల్లోజుల… మిగిలిన మావోయిస్టులు లొంగిపోవాలని కోరారు. సమాజంలో తిరిగి కలిసిపోవాలని… కొత్త జీవితాలను ప్రారంభించడానికి ప్రభుత్వ పునరావాస పథకాలను ఉపయోగించుకోవాలని కోరారు.తాజాగా ఏపీలోని మారేడుమిల్లిలో జరిగిన ఎన్ కౌంటర్ల నేపథ్యంలో మల్లోజుల నుంచి వీడియో సందేశం విడుదలైనట్లు తెలిసింది.వేణు గోపాల్ వీడియోను గడ్చిరోలి పోలీసులు విడుదల చేశారు.
కొద్దిరోజులుగా మావోయిస్టు పార్టీ ఉద్యమ చరిత్రలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు అగ్ర నేతలు లొంగిపోతున్నారు. ఆ పార్టీలో దశాబ్ధాలుగా పని చేస్తూ, కేంద్ర కమిటీలో కీలకంగా ఉన్న సీనియర్ నేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ భూపతి ఇటీవలనే లొంగిపోయారు. 60 మంది కార్యకర్తలతో కలిసి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఈ లొంగుబాటు జరిగిన సంగతి తెలిసిందే.
మల్లోజుల వేణుగోపాల్ 1981లో తాను ఎంచుకున్న సిద్దాంతం కోసం అడవి బాట పట్టారు. మొదటగా ఏటూరు నాగారం దళం సభ్యుడిగా ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1982లో మహదేవపూర్ పోలీసులు మల్లోజులను అరెస్టు చేయగా, 1983లో విడుదల కావడంతో తిరిగి దళంలోకి వెళ్లారు. 1993లో డీకేఎస్ఆర్సీ సెక్రటరీగా ఎన్నికయ్యారు. 1995లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో పొలిట్ బ్యూరో మెంబర్ గా పదోన్నతి లభించింది. పార్టీలో అంచలంచెలుగా ఎదుగుతూ కీలకంగా మారారు.
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్లోజుల వేణుగోపాల్ కుటుంబ నేపథ్యం కూడా పోరాటాలకు కేరాఫ్ అనే చెప్పొచ్చు. వెంకటయ్య, మధురమ్మ దంపతులకు వేణుగోపాల్‌రావు మూడో సంతానం. తండ్రి వెంకటయ్య తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పని చేశారు. అంతేకాకుండా ఆయన సోదరుడైన మల్లోజుల కిషన్ జీ కూడా మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా కొనసాగారు. 24 నవంబర్ 2011 న పశ్చిమబెంగాల్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మల్లోజుల కిషన్ జీ (కోటేశ్వర్ రావు) ప్రాణాలు కోల్పోయారు.
{{/usCountry}}తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్లోజుల వేణుగోపాల్ కుటుంబ నేపథ్యం కూడా పోరాటాలకు కేరాఫ్ అనే చెప్పొచ్చు. వెంకటయ్య, మధురమ్మ దంపతులకు వేణుగోపాల్‌రావు మూడో సంతానం. తండ్రి వెంకటయ్య తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పని చేశారు. అంతేకాకుండా ఆయన సోదరుడైన మల్లోజుల కిషన్ జీ కూడా మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా కొనసాగారు. 24 నవంబర్ 2011 న పశ్చిమబెంగాల్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మల్లోజుల కిషన్ జీ (కోటేశ్వర్ రావు) ప్రాణాలు కోల్పోయారు.
{{/usCountry}}