Konda Surekha Social Media Post : తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ అధినాయకత్వం నిర్ణయంతో కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖ… ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే…. ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ ప్రకటన చేశారు. అతి త్వరలోనే తాను ఒక కీలక నిర్ణయాన్ని వెల్లడించబోతున్నట్లు పేర్కొన్నారు.
నిరీక్షణ ముగిసింది - కొండా సురేఖ పోస్ట్

"ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలోనే ఒక సంచలనాత్మక నిర్ణయాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను," అని కొండా సురేఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె చేసిన ఈ చిన్న పోస్ట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
గత కొంతకాలంగా కొండా సురేఖ పొలిటికల్ మూవ్‌మెంట్స్‌పై పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో స్వయంగా ఆమె "కీలక నిర్ణయం" అంటూ అధికారికంగా ప్రకటన చేయడంతో…. ఆమె రాబోయే రాజకీయ అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయనే దానిపై ముమ్మర చర్చ సాగుతోంది. ఆమె పార్టీ మారుతారా? లేదా మరేదైనా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కొండా దంపతుల పాత్ర అత్యంత ప్రాధాన్యమైనది. వారి రాజకీయ నిర్ణయం హస్తం పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సురేఖ చేయబోయే ప్రకటన ఏమిటనేది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.
{{/usCountry}}ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కొండా దంపతుల పాత్ర అత్యంత ప్రాధాన్యమైనది. వారి రాజకీయ నిర్ణయం హస్తం పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సురేఖ చేయబోయే ప్రకటన ఏమిటనేది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.
{{/usCountry}}