New Ration Card Apply : కొత్తగా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలా..? ఈ పత్రాలను సిద్ధం చేసుకోండి, ప్రాసెస్ ఇలా

తెలంగాణలో కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకునే ప్రక్రియ మరింత సులువైంది. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సమీపంలోని మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Nov 9, 2026, 10:19:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కొత్తగా రేషన్ కార్డుకు అప్లయ్ చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీసేవా కేంద్రాలను సంప్రదించి… చాలా సులభంగా దరఖాస్తు పూర్తి చేసుకోవచ్చు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే నేరుగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసే సౌకర్యం అందుబాటులో ఉంది.

మీసేవా ద్వారా కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు (Gemini AI Generated Image)
మీసేవా ద్వారా కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు (Gemini AI Generated Image)

అర్హులైన పౌరులు తమకు సమీపంలో ఉన్న ‘మీ సేవా’ కేంద్రాన్ని సందర్శించి కేవలం నిమిషాల వ్యవధిలోనే కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. దరఖాస్తు కోసం కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులతో పాటు కరెంట్ బిల్లు లేదా గ్యాస్ బిల్లు ఉండాలి.

దరఖాస్తుకు కావాల్సిన ముఖ్యమైన పత్రాలు:

కొత్త రేషన్ కార్డు కోసం మీ సేవా కేంద్రానికి వెళ్లేముందు దరఖాస్తుదారులు ఈ క్రింది పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.

  • కుటుంబ సభ్యులందరి ఆధారిత పత్రాలు
  • ఇంటి కరెంట్ బిల్లు లేదా గ్యాస్ బిల్లు (నివాస ధ్రువీకరణ కోసం)
  • ఆధార్ నంబర్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్

మీ సేవా కేంద్రంలో దరఖాస్తు విధానం:

అవసరమైన పత్రాలతో సమీపంలోని మీసేవా కేంద్రానికి వెళ్తే…. అక్కడి సిబ్బంది ఆన్‌లైన్ పోర్టల్‌లో దరఖాస్తు వివరాలను నమోదు చేస్తారు. డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేసిన అనంతరం దరఖాస్తుదారునికి రసీదు (అక్నాలెడ్జ్‌మెంట్) అందజేస్తారు. ఈ రసీదు ఆధారంగా అప్లికేషన్ ఏ దశలో ఉందో ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం అర్హులకు కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తారు.

మీ అప్లికేషన్ స్టేటస్ ఎలా తెలుసుకోవచ్చు?

  • దరఖాస్తుదారుడు https://epds.telangana.gov.in/FoodSecurityAct/ వెబ్ సైట్ లింక్ పై క్లిక్ చేయండి.
  • హోంపేజీలో 'FSC Search' ఆప్షన్ పై నొక్కాలి.
  • ఆ తర్వాత పేజీలో 'Ration Card Search' డ్రాప్ డౌన్ లో 'FSC Search' ఆప్షన్ పై క్లి్క్ చేయండి.
  • మీ సేవా నెంబర్ ను సెలెక్ట్ చేయాలి. ఇక్కడ జిల్లాను ఎంచుకుని…. మీ రిఫరెన్స్ నెంబర్ ను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
  • మీ అప్లికేషన్ ఏ స్థితిలో ఉందో తెలుస్తుంది.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More