రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. 2027 నుంచి రేషన్ షాపుల్లో ఇవి కూడా!

Ration Card : తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం శుభవార్త అందించనుంది. కొత్త ఏడాది నుంచి ఉచిత బియ్యంతోపాటుగా మరో 6 రకాల నిత్యావసర వస్తువులను రేషన్ షాపుల ద్వారా అందించనుంది.

Published on: Oct 28, 2026, 19:58:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరటనిచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కార్యక్రమానికి రూపకల్పన చేస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా ప్రస్తుతం అందిస్తున్న ఉచిత బియ్యంతో పాటు ప్రతి ఇంటా ప్రతినిత్యం వినియోగించే ఆరు ముఖ్యమైన నిత్యావసర సరుకులను రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయడానికి ప్రణాళికలు వేగవంతం చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం రేషన్ షాపుల్లో కేవలం బియ్యం మాత్రమే లభిస్తుండటంతో, వంటకు కావాల్సిన మిగిలిన సరకుల కోసం పేద ప్రజలు బహిరంగ మార్కెట్‌పై ఆధారపడి వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ భారాన్ని తగ్గించేందుకు పౌరసరఫరాల శాఖ సిద్ధం చేసిన ప్రతిపాదనల్లోని ముఖ్య సరుకులు చూసుకుంటే.. కందిపప్పు, వంట నూనె (పామాయిల్), చింతపండు, కారంపొడి, చక్కెర, గోధుమపిండి అందిస్తారు.

ఈ సరుకులను రాయితీ ధరలకు లేదా ఉచితంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించడం ద్వారా ప్రతి నిరుపేద కుటుంబానికి నెలవారీ బడ్జెట్‌లో గణనీయమైన ఆర్థిక ఊరట లభించనుంది. ప్రస్తుత పౌరసరఫరాల శాఖ గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల వివరాలు చూస్తే.. మొత్తం ఆహార భద్రత రేషన్ కార్డులు దాదాపు 1.06 కోట్లుగా ఉన్నాయి. మొత్తం లబ్ధిదారులు సుమారు 3.42 కోట్ల మంది.

వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులు, కరువు ప్రభావం, పెరిగిన వ్యయం దృష్ట్యా రాష్ట్రంలోని మెజారిటీ జనాభాకు సంపూర్ణ ఆహార భరోసా కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఈ బృహత్తర పథకాన్ని క్షేత్రస్థాయిలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అమలు చేయడానికి పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు:

ప్రతి కార్డుదారునికి లేదా ప్రతి లబ్ధిదారునికి ఏ పరిమాణంలో (కిలోలు/లీటర్లలో) సరుకులు అందించాలి? నాణ్యతా ప్రమాణాలపై కసరత్తు జరుగుతోంది. 6 రకాల సరుకుల పంపిణీ వల్ల రాష్ట్ర ఖజానాపై పడే అదనపు బడ్జెట్ భారంపై చర్చ జరుగుతోంది. మార్కెట్‌లో కృత్రిమ కొరత ఏర్పడకుండా కాపాడేందుకు, సరుకులను ముందుగానే బల్క్ పద్ధతిలో సేకరించి జిల్లాల్లోని సివిల్ సప్లైస్ గొడౌన్లకు తరలించే అవకాశం ఉంది.

యాసంగి సీజన్‌లో పంటల సాగు సరళి, నీటి లభ్యత, వర్షాభావ పరిస్థితులను నిశితంగా పరిశీలించిన తర్వాత పంపిణీ ప్రక్రియను ముమ్మరం చేయాలని సర్కారు భావిస్తోంది. సరఫరా వ్యవస్థను బలోపేతం చేసి, ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా వచ్చే సంక్రాంతి నాటికి ఈ 6 రకాల నిత్యావసరాలను నేరుగా రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారుల చేతికి అందించేలా పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More