ఐఏఎస్ అధికారిణిపై వార్తలు.. ప్రముఖ న్యూస్ ఛానల్‌తోపాటు యూట్యూబ్ ఛానళ్లపై కేసు
ఐఏఎస్ అధికారిణిపై ఇటీవల వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఐఏఎస్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు ప్రముఖ వార్తా సంస్థ ఎన్టీవీతోపాటుగా ఇతర న్యూస్ ఛానళ్లపై కేసు నమోదు చేశారు. దీనికి కారణం మహిళా ఐఏఎస్ అధికారిపై కథనాలు ప్రచురించడమే. ఈ వార్తలపై ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు. తెలంగాణ ఐఏఎస్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఫిర్యాదు చేశారు.

ఇటీవల ఒక మహిళా ఏఐఎస్ అధికారిపై వార్తలు ప్రసారం కావడం రాష్ట్రంలో కలకలం రేపింది. ఇలాంటి తప్పుడు వార్తలపై తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఐపీఎస్ అసోసియేషన్ సీరియస్ అయింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వార్తను సోషల్ మీడియాలో వైరల్ చేసినందుకు కూడా కేసు నమోదు అయింది.
ఎన్‌టీవీ యాజమాన్యం, ఎడిటర్లు, రిపోర్టర్లుతోపాటుగా తెలుగు స్క్రైబ్, ఎంఆర్ మీడియా తెలంగాణ, ప్రైమ్9 తెలంగాణ, పీవీ న్యూస్, సిగ్నల్ టీవీ తెలుగు, వోల్గా టైమ్స్, మిర్రర్ టీవీ అఫీషియల్, టీ న్యూస్ తెలుగుపై కేసు నమోదైంది.
జనవరి 8వ తేదీన ప్రసారం చేసిన వార్తలో మహిళా ఐఏఎస్ అధికారికి రాజకీయ నాయకులతో సంబంధం ఉందని దారుణమైన ఆరోపణలు చేశారు. ఈ కథనంలో అధికారిణి పేరు ప్రస్తావించలేదు కానీ, ఆమె పని చేసిన జిల్లా పేరును చెప్పారు. ఇది ఆఫీసర్ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే కాకుండా, నైతికతను దెబ్బతీసేలా ఉందని ఫిర్యాదులో తెలిపారు. ఇందులో అసభ్యకరమైన వ్యాఖ్యలు, ద్వంద్వ అర్థాలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వేధింపులు, మహిళల గౌరవానికి భంగం కలిగించడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అవమానించండ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే ఈ వార్తపై రచ్చ రచ్చ అయింది. మంత్రులు, అధికారులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


