ప్రజా పాలన ప్రజా వియోజత్సవాల్లో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో రూ.262 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనస్వాగతం పలికారు. హుస్నాబాద్ సభకు మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకట్ స్వామి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, సంజయ్ కుమార్, సిరిసిల్ల రాజయ్య, ఇనగాల వెంకట్రామిరెడ్డి , ఇతర ముఖ్య నేతలు హాజరు అయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. 'మా ప్రభుత్వంలో ఇప్పటికే 60 వేల ఉద్యోగాలు ఇచ్చాం. అతి త్వరలో మరో 40 వేల ఉద్యోగాలు ఇస్తాం. రెండున్నరేళ్ల పాలన పూర్తయ్యేలోగా లక్ష ఉద్యోగాలు పూర్తి చేస్తాం. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ హుస్నాబాద్ నుంచి బహుజనులు దండు కట్టి ఉద్యమించారు. తెలంగాణ ఉద్యమం ఇక్కడి నుంచే ఉవ్వెత్తున ఎగిసిపడింది. 2004లో కరీంనగర్ గడ్డ నుంచి తెలంగాణ ఇస్తానని ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ మాట ఇచ్చి నిలబెట్టుకున్నారు.' అని రేవంత్ రెడ్డి అన్నారు.
50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తున్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకు నిధులు ఎక్కువ ఇచ్చారని, మిగిలిన ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. హుస్నాబాద్‌కు పది సంవత్సరాలు నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 'గౌరెల్లి ప్రాజెక్టుకు ఎన్ని నిధులైన ఇచ్చి పూర్తి చేస్తాం. త్వరలో ప్రాజెక్టు పూర్తి చేస్తాం. బీఆర్ఎస్ హయాంలో లాగా హుస్నాబాద్‌ను నిర్లక్ష్యం చేయం. పదేళ్లలో ఎవరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా అలసత్వం ప్రదర్శించారు.' అని సీఎం రేవంత్ విమర్శించారు.
కాంగ్రెస్ హయాంలో కట్టిన ఎస్ఆర్ఎస్పీ ఎలా ఉంది, బీఆర్ఎస్ నిర్మించిన కాళేశ్వరం ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో అత్యధికంగా వరిని పండించేది మన రాష్ట్రంలోనేనని చెప్పారు. రైతుల కోసం రూ.లక్ష కోట్లపైన ఖర్చు చేశామన్నారు. రాష్ట్రంలో వందలాది బస్సులకు ఆడబిడ్డలు యజమానులు అయ్యారని పేర్కొన్నారు. రూ.22,500 కోట్లు పేదల ఇళ్ల కోసం ఖర్చు చేస్తున్నామన్నారు.
రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం థాంక్స్
{{/usCountry}}కాంగ్రెస్ హయాంలో కట్టిన ఎస్ఆర్ఎస్పీ ఎలా ఉంది, బీఆర్ఎస్ నిర్మించిన కాళేశ్వరం ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో అత్యధికంగా వరిని పండించేది మన రాష్ట్రంలోనేనని చెప్పారు. రైతుల కోసం రూ.లక్ష కోట్లపైన ఖర్చు చేశామన్నారు. రాష్ట్రంలో వందలాది బస్సులకు ఆడబిడ్డలు యజమానులు అయ్యారని పేర్కొన్నారు. రూ.22,500 కోట్లు పేదల ఇళ్ల కోసం ఖర్చు చేస్తున్నామన్నారు.
రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం థాంక్స్
{{/usCountry}}శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ హుస్నాబాద్‌కి ఇచ్చినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఏటీసీ, 250 పడకల ఆసుపత్రి, ఎల్లమ్మ చెరువు అభివృద్ధి, నాలుగు లైన్ ల రోడ్డు మంజూరు చేసినందుకు రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఇదే గ్రౌండ్‌లో ప్రియాంక గాంధీ సభకి వచ్చిన విషయం గుర్తు చేశారు.