Telangana Inter Exams 2027 : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు ఊరటనిచ్చే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. పరీక్షల సమయంలో విద్యార్థులపై ఉండే మానసిక ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా….. ఈసారి వార్షిక పరీక్షల మధ్య వ్యవధిని పెంచాలని యోచిస్తోంది. ఇప్పటికే అధికారులు ప్రాథమికంగా కసరత్తు పూర్తి చేయగా…. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది.

ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం ఒకరోజు ఫస్ట్ ఇయర్, మరుసటి రోజు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా ఒకే సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఒక పరీక్షకు, మరో పరీక్షకు మధ్య కేవలం ఒక రోజు మాత్రమే సమయం దొరుకుతోంది. దీంతో పాఠ్యాంశాలను సరిగ్గా పునశ్చరణ (రివిజన్) చేసుకోవడానికి సమయం చాలక విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
షెడ్యూళ్లు సిద్ధం….!
ఈ పరిస్థితిని గమనించిన ఇంటర్మీడియట్ బోర్డు….. విద్యార్థుల ప్రయోజనాల కోసం కొత్త ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా పరీక్షల మధ్య ఉండే వ్యవధిని రెండు రోజులకు పెంచాలని యోచిస్తోంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు రెండు వేర్వేరు షెడ్యూళ్లను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. సాధారణ పద్ధతిలో ఒక టైమ్‌టేబుల్, అలాగే ఒక్కో పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండేలా మరో టైమ్‌టేబుల్‌ను సిద్ధం చేసి విద్యాశాఖకు పంపించారు.
పరీక్షల మధ్య రెండు రోజుల వ్యవధి లభిస్తే విద్యార్థులు తగినంత విశ్రాంతి తీసుకోవడంతో పాటు పాఠ్యాంశాలను క్షుణ్ణంగా పునశ్చరణ చేసుకోవడానికి తగిన సమయం దొరుకుతుంది. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు ఎలాంటి మానసిక ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయగలరని అధికారులు నమ్ముతున్నారు. దీంతో ఇంటర్ బోర్డు పంపిన రెండు రోజుల వ్యవధి కలిగిన టైమ్టేబుల్కే ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పరీక్షలు ఎప్పుడు..?
మరోవైపు వచ్చే ఏడాది ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. త్వరలోనే త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన విడుదల కానుంది. షెడ్యూల్ తో పాటు టైమింగ్స్ వివరాలను కూడా వెల్లడిస్తారు.
{{/usCountry}}మరోవైపు వచ్చే ఏడాది ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. త్వరలోనే త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన విడుదల కానుంది. షెడ్యూల్ తో పాటు టైమింగ్స్ వివరాలను కూడా వెల్లడిస్తారు.
{{/usCountry}}ఈసారి కొత్తగా ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులిద్దరికీ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 18 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఈసారి సుమారు 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు.