హైదరాబాద్ నగరాన్ని మరింత పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) సరికొత్త ముందడుగు వేసింది. నగరవాసులు తమ ఇళ్లలోని పాత పరుపులు, విరిగిన ఫర్నిచర్ వంటి పెద్ద వ్యర్థాలను సులభంగా వదిలించుకునేందుకు సరికొత్త డోర్‌స్టెప్ పికప్(ఇంటి వద్దకే వచ్చి సేకరించే) సేవలను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్మూలన, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

గతంలో ఈ-వేస్ట్ (ఎలక్ట్రానిక్ వ్యర్థాలు), దేవుడి పటాలు-పూజా సాగ్రి వంటి వాటిని విజయవంతంగా సేకరించిన జీహెచ్‌ఎంసీ, ఇప్పుడు భారీ గృహ వ్యర్థాలపై దృష్టి సారించింది.
నగర ప్రజలు తమ ఇంట్లోని పాత పరుపులు లేదా ఫర్నిచర్‌ను తొలగించాలనుకుంటే.. జీహెచ్‌ఎంసీ త్వరలో అందుబాటులోకి తేనున్న ప్రత్యేక క్యూఆర్ కోడ్ లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా రిక్వెస్ట్ పంపాల్సి ఉంటుంది. ప్రజలు తమ ప్రస్తుత లొకేషన్‌ను షేర్ చేసి, వస్తువులకు సంబంధించిన ప్రాథమిక వివరాలను నమోదు చేయాలి.
ఆ వెంటనే జీహెచ్‌ఎంసీ ద్వారా లైసెన్స్ పొందిన అధికారిక బృందాలు నేరుగా వారి ఇంటికే వచ్చి ఆ వస్తువులను ఉచితంగా సేకరిస్తాయి.
సాధారణంగా నగరంలో చాలామంది పాత పరుపులను, సోఫాలను, విరిగిన కుర్చీలను రాత్రికి రాత్రే రోడ్ల పక్కన, బహిరంగ ప్రదేశాలలో లేదా మురికి కాలువల సమీపంలో పారేస్తున్నారు. దీనివల్ల వర్షాకాలంలో వరద నీరు ప్రవహించే బాక్స్ డ్రైన్లు పూడుకుపోయి, రోడ్లపై నీరు నిలిచిపోతోంది. ఈ సమస్యకు అడ్డుకట్ట వేయడంతో పాటు, నగర రూపురేఖలను మార్చడానికి జీహెచ్‌ఎంసీ ఈ వినూత్న ప్రణాళికను సిద్ధం చేసింది.
ఈ సరికొత్త కార్యక్రమం ద్వారా డంపింగ్ యార్డులకు వెళ్లే వ్యర్థాల పరిమాణం గణనీయంగా తగ్గుతుందని అధికారులు తెలిపారు. పాత వస్తువుల నుండి విలువైన వనరులను సేకరించి రీసైక్లింగ్ చేయడం ద్వారా సర్క్యులర్ ఎకానమీకి తోడ్పాటు లభిస్తుంది.
{{/usCountry}}ఈ సరికొత్త కార్యక్రమం ద్వారా డంపింగ్ యార్డులకు వెళ్లే వ్యర్థాల పరిమాణం గణనీయంగా తగ్గుతుందని అధికారులు తెలిపారు. పాత వస్తువుల నుండి విలువైన వనరులను సేకరించి రీసైక్లింగ్ చేయడం ద్వారా సర్క్యులర్ ఎకానమీకి తోడ్పాటు లభిస్తుంది.
{{/usCountry}}హైదరాబాద్‌ను మరింత స్వచ్ఛంగా, పచ్చదనంతో కూడిన సుస్థిర నగరంగా మార్చడానికి నగర ప్రజలంతా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని జీహెచ్‌ఎంసీ విజ్ఞప్తి చేసింది. ఈ డోర్‌స్టెప్ పికప్ సేవలు అధికారికంగా ఎప్పటి నుండి ప్రారంభమవుతాయనే తేదీని అధికారులు త్వరలోనే వెల్లడించనున్నారు.