GHMC Expansion : ఇక జీహెచ్‌ఎంసీలో 12 జోన్లు, 60 సర్కిళ్లు - సర్కార్ గ్రీన్ సిగ్నల్
జీహెచ్‌ఎంసీ పునర్వివిభజనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ విస్తరణ నేపథ్యంలో… జోన్లు సర్కిల్స్ సంఖ్యను పెంచుతూ గురువారం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం 6 జోన్లు ఉండగా.. వీటి సంఖ్యను 12కు పెంచింది. 30 సర్కిళ్లు 60కి పెరిగాయి.
గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) పునర్విభజనకు సంబంధించిన నోటిఫికేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుతం ఉన్న జోన్లు… రెట్టింపయ్యాయి. ప్రస్తుతం ఉన్న సర్కిల్స్ కూడా 60కి పెరిగాయి.

జోన్లు, సర్కిళ్లు రెట్టింపు…
GHMCని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గతంలో ఉన్న 6 జోన్లను 12 జోన్లుగా.. 30 సర్కిల్స్ ను 60కి పెంచింది. ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ కొత్త జోన్లుగా మారనున్నాయి. సర్కిల్ ఆఫీసులలో కొత్త జోన్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌లోని 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడంతో పెరిగిన పరిధిని 300 వార్డులుగా ఖరారు చేశారు. ఈ పునర్విభజనకు సంబంధించి జీహెచ్‌ఎంసీ కమిషనర్ … గురువారం తుది నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ తుది నోటిఫికేషన్ మేరకు… 27 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు జీహెచ్‌ఎంసీలో విలీనమయ్యాయి. 12 జోన్లు, 60 సర్కిళ్లుగా పునర్విభజనను ఆమోదిస్తూ ప్రభుత్వం జీవో 292ను జారీ చేసింది.
డివిజన్ల డీలిమిటేషన్‌కు సంబంధించి ఈనెల 9న రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి 10 రోజులపాటు అభ్యంతరాలను స్వీకరించింది. డివిజన్ల డీలిమిటేషన్‌కు సంబంధించి 6 వేలకు పైగా అభ్యంతరాలు దాఖలయ్యాయి. సహేతుక అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం… తుది నోటిఫికేషన్ విడుదల చేసింది.
తెలంగాణ రైజింగ్ 2047లో భాగంగా రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా విభజించి అభివృద్ధి చేయనున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు. మెుదటిది క్యూర్(కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ). ఇది ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల ఉన్న ప్రాంతం. ఇప్పుడు జీహెచ్ఎంసీ మెుత్తం దీని పరిధిలోకి వస్తుంది. దీనిలో భాగంగా అనేక రాష్ట్ర ప్రభుత్వం రకాల చర్యలు తీసుకుంటుంది .
రెండోది ప్యూర్(పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ). ఇది ఓఆర్ఆర్, రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) మధ్య ఉన్న ప్రాంతం. ఆర్ఆర్ఆర్ సుమారు 360 కిలోమీటర్లతో తెలంగాణకు మరో మణిహారంగా ఉండనుంది. దీనిని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా అభివృద్ధి చేయనుంది ప్రభుత్వం. మూడోది రేర్(రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ). ఇది రీజనల్ రింగ్ రోడ్డు బయట నుంచి తెలంగాణ సరిహద్దు వరకు ఉండే ప్రాంతం. ఇందులో వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలు కవర్ అవుతాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

