...
...
Next Story

జీహెచ్ఎంసీ విస్తరణ.. హైదరాబాద్ మెుత్తం కవర్ అయ్యేలా మెట్రో రింగ్!

ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ హైదరాబాద్ మెట్రో విస్తరణపై అధికారులు పరిశీలన చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో నిర్మాణం ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది. వేలాది మందికి వేగవంతమైన, సౌకర్యవంతమైన కనెక్టివిటీని అందిస్తుంది.

Published on: Dec 1, 2025, 12:55:49 IST
Advertisement

జీహెచ్ఎంసీ విస్తరణ గురించి ఇటీవలే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దీంతో ఓఆర్ఆర్ చుట్టుపక్కల మున్సిపాలిటీలు కూడా జీహెచ్‌ఎంసీలోకి రానున్నాయి. అయితే జీహెచ్ఎంసీని మూడు పెద్ద కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తారనే చర్చ కూడా జరుగుతోంది. నగర పరిమితులు 650 చదరపు కిలోమీటర్ల నుండి దాదాపు 2,000 చదరపు కిలోమీటర్లకు పెరగనుంది. దీంతో రవాణా కనెక్టివిటీని పెంచడానికి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రో రైలును విస్తరించే ప్రణాళికను అధికారులు పరిశీలిస్తున్నారు.

హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో

ORR వెంబడి ఉన్న ప్రాంతాలను సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌గా పరిగణిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఓఆర్ఆర్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు తరహాలో హైదరాబాద్ చుట్టూ మెట్రో రింగ్ ఏర్పాటుపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. జాతీయ రహదారుల నుండి నగరంలోకి ప్రవేశించే వాహనాలను పరిమితం చేయడానికి, ఔటర్ లోపల నివసించేవారికి మెరుగైన కనెక్టివిటీకి సాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇది ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గిస్తుంది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఓఆర్ఆర్‌ను నగరంతో అనుసంధానించడానికి ఫేజ్-III ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రణాళికలో శంషాబాద్ జంక్షన్ (జాతీయ రహదారి 44) నుండి తుక్కుగూడ, బొంగుళూరు ద్వారా పెద్ద అంబర్‌పేట వరకు 40 కి.మీ కారిడార్ ఉంది. ఇతర ప్రతిపాదిత కారిడార్లలో పెద్ద అంబర్‌పేట (NH 65) నుండి ఘట్‌కేసర్, షామిర్‌పేట ద్వారా మేడ్చల్ జంక్షన్ వరకు 45 కి.మీ.; మేడ్చల్ జంక్షన్ (NH 44) నుండి దుండిగల్ ద్వారా పటాన్‌చెరు జంక్షన్ (NH 65) వరకు 29 కి.మీ.; మరియు పటాన్‌చెరు జంక్షన్ నుండి కోకాపేట ద్వారా నర్సింగి జంక్షన్ వరకు 22 కి.మీ. ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe