ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం విషయం సుప్రీం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్..కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఈ విషయంపై బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ.. ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లారు. సుప్రీం కోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థించింది.

తెలంగాణ హైకోర్టు విధించిన అనర్హత వేటును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. భారత రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కింద దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసిన విషయంలో తెలంగాణ హైకోర్టు తీర్పులో జోక్యోం చేసుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పు సరైనదేనని చెప్పింది. మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని సూచించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కీలక నిర్ణయాన్ని వెలువరించింది.
విచారణ సందర్భంగా దానం నాగేందర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ తమ వాదనలను వినిపించారు. ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచినంత మాత్రాన మరో పార్టీ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేయడానికి రాజ్యాంగంలో ఎలాంటి స్పష్టమైన నిషేధం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గతంలో బీహార్‌కు చెందిన మహాచంద్రప్రసాద్ కేసును ప్రాతిపదికగా తీసుకుని హైకోర్టు తనను అనర్హుడిగా ప్రకటించడాన్ని ఆయన ఆక్షేపించారు.
వ్యక్తిగతంగా ఏ పార్టీలోనైనా చేరడం రాజ్యాంగబద్ధమైన హక్కే అయినప్పటికీ, ప్రజాప్రతినిధిగా పదవిలో కొనసాగుతూ మరొక పార్టీ బి-ఫామ్‌పై పోటీ చేయడం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. ఒక సీటుపై గెలిచి, మరో పార్టీలో చేరినప్పుడు ఘర్ వాపసీ లేదా సాంకేతిక కారణాలు చెల్లవని తేల్చిచెప్పింది. అనర్హత వేటు పడిన తర్వాత మళ్లీ ప్రజాక్షేత్రంలోకే వెళ్లి ఎన్నికల ద్వారా ప్రతినిధిగా గెలవడమే సరైన మార్గమని వ్యాఖ్యానించింది.
దానం నాగేందర్ ఇతర పార్టీ బి-ఫామ్‌పై పోటీ చేయడాన్ని సవాల్ చేస్తూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ నిర్ణయంతో విభేదిస్తూ, దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.
{{/usCountry}}దానం నాగేందర్ ఇతర పార్టీ బి-ఫామ్‌పై పోటీ చేయడాన్ని సవాల్ చేస్తూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ నిర్ణయంతో విభేదిస్తూ, దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.
{{/usCountry}}హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా, సుప్రీంకోర్టు హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గానికి ఉపఎన్నిక తప్పనిసరి అయింది. తెలంగాణ రాజకీయంలో ఈ తీర్పు ఇతర పార్టీ ఫిరాయింపుదారులకు కూడా ఒక పెద్ద హెచ్చరికగా కానుంది.