విదేశీ విద్యను అభ్యసించాలనుకునే తెలంగాణకు చెందిన మైనారిటీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. హైదరాబాద్‌లోని మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం 'ముఖ్యమంత్రి విదేశీ విద్యా నిధి పథకం (Chief Minister's Overseas Scholarship Scheme) - స్ప్రింగ్ సీజన్ 2026' కింద అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఈ పథకం కింద విదేశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG), పీహెచ్‌డి (Ph.D) వంటి ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే మైనారిటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం గుర్తించిన దేశాలలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలలో అడ్మిషన్ పొందిన వారికి ఈ స్కాలర్‌షిప్ వర్తిస్తుంది: అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, సౌత్ కొరియా, జపాన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్‌లో చదువుకోవచ్చు.
లభించే ఆర్థిక సహాయం ఎంత?
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం తరఫున భారీ ఆర్థిక సాయం అందుతుంది. స్కాలర్‌షిప్ మొత్తం గరిష్టంగా రూ. 20 లక్షల వరకు ఆర్థిక సహాయం మంజూరు చేస్తారు. విదేశాలకు వెళ్లేందుకు వన్-వే విమాన టికెట్ ఛార్జీల కింద గరిష్టంగా రూ. 60,000 వరకు అదనంగా అందజేస్తారు.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తులు ప్రారంభ తేదీ: జూన్ 01, 2026 (01.06.2026)
- దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 30, 2026 (30.06.2026) సాయంత్రం 5:00 గంటల వరకు.
ఈ స్ప్రింగ్ సీజన్-2026 నోటిఫికేషన్ అనేది కేవలం జనవరి 01, 2026 నుండి జూన్ 30, 2026 మధ్య కాలంలో విదేశీ విశ్వవిద్యాలయాలలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం కేటాయించిన అధికారిక వెబ్‌సైట్ www.telanganaepass.cgg.gov.in ను సందర్శించాల్సి ఉంటుంది.
- దరఖాస్తుదారులు తమ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కు సంబంధించిన ఒరిజినల్ ట్రాన్స్క్రిప్ట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
- ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తయిన తర్వాత, సంబంధిత ఫైళ్లను సమర్పించడానికి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా స్వయంగా జిల్లా మైనారిటీ సంక్షేమ కార్యాలయాలకు హాజరుకావలసి ఉంటుంది.
నకిలీ సర్టిఫికెట్లు ఉంటే క్రిమినల్ చర్యలు
అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికెట్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఒకవేళ ఎవరైనా తప్పుడు సమాచారంతో నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు తేలితే, వారిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్ బి.షఫివుల్లా పేర్కొన్నారు.
{{/usCountry}}అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికెట్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఒకవేళ ఎవరైనా తప్పుడు సమాచారంతో నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు తేలితే, వారిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్ బి.షఫివుల్లా పేర్కొన్నారు.
{{/usCountry}}