...
...
Next Story

టీజీఎస్ఆర్టీసీ నుంచి గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు!

హైదరాబాద్‌ నగరానికి రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. టీజీఎస్ఆర్టీసీ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Updated on: Dec 29, 2025, 10:31:20 IST
Advertisement

హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్ రానుంది. కేంద్ర ప్రభుత్వ పీఎం ఈ-డ్రైవ్‌ పథకం కింద గ్రేటర్‌ హైదరాబాద్‌కు త్వరలోనే 2,000 ఎలక్ట్రిక్‌ బస్సులు రానున్నాయి. ఈ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) నడపనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. టెండర్లకు సంబంధించి కీలక దశ పూర్తయింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

దేశంలోని అనేక నగరాల్లో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడం, ప్రజా రవాణాను ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ డ్రైవ్ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా మెుత్తం 10,900 ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్లను ఆహ్వానించారు. కేంద్రం తెరిచిన ఆర్థిక బిడ్లలో తెలంగాణ నుంచి మేఘా, గ్రీన్‌సెల్ మెుబిలిటీ సంస్థలు అర్హత సాధించాయి. మేఘాకు చెందిన ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాట్ 1లో 1,085 బస్సులు పొందడానికి అర్హత సాధించింది. గ్రీన్‌సెల్‌ మొబిలిటీ లాట్‌-2లో 915 బస్సులకు అర్హత పొందింది. ఈ 2 వేల బస్సులు దశలవారీగా హైదరాబాద్‌లో అందుబాటులోకి రానున్నాయి.

ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL) అనుబంధ సంస్థ, కేంద్ర ప్రభుత్వం నామినేటెడ్ ఏజెన్సీ అయిన CESL, ఐదు ప్రధాన నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరచడం, శబ్ద కాలుష్యాన్ని తగ్గించడం, జీవన ప్రమాణాలను పెంచే ప్రయత్నంలో భాగంగా డీజిల్ బస్సులను మార్చే కార్యక్రమానికి నాయకత్వం వహిస్తోంది.

PM E-DRIVE కింద, 14,028 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు అయ్యాయి. వీటిలో ఫేజ్-Iలో 10,900 ఉన్నాయి. ఈ టెండర్ హైదరాబాద్‌తో సహా ప్రధాన నగరాలు, రాష్ట్ర రవాణా సంస్థలను కవర్ చేస్తుంది. 10,000 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు కోసం టెండర్లు ఖరారు చేసినప్పుడు దాదాపు నాలుగు మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయని సీఈఎస్ఎల్ అంచనా వేసింది. ఈ మెగా టెండర్ PM E-DRIVE (ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్) పథకంలో భాగం.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe