కొన్ని దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్(ULC) దరఖాస్తుల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం 2016లోనే ULC కింద పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు జీవో జారీ చేసినప్పటికీ, దానిని అమలు చేయకపోవడంతో వేలాది దరఖాస్తులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండిపోయాయని తెలిపారు.

ఫలితంగా ప్రజలు తమ భూములపై హక్కులు, లావాదేవీల విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పానికి అనుగుణంగా సహచర క్యాబినెట్ మంత్రులతో చర్చించి 22ఏ సమస్యలకు ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరించే దిశగా ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.
తెలంగాణ పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం కింద పాక్షికంగా క్రమబద్ధీకరించిన, క్రమబద్ధీకరించని కాలనీలకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి, అర్హత ఉన్న కేసులను నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు మంత్రి పొంగులేటి. ఈ మేరకు గతంలో జారీ చేసిన GO నం.455, 456, 747, 92 కింద వచ్చిన పెండింగ్ యూఎల్‌సీ దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించే విధంగా Memo.No.48062/ULC/A1/2026-1, జారీ చేసినట్లు వెల్లడించారు.
అర్హత కలిగిన కేసుల్లో నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని ప్రక్రియలు పూర్తి చేసి క్రమబద్ధీకరణ చర్యలు తక్షణం చేపట్టాలని అధికారులను ఆదేశించినట్టుగా మంత్రి పొంగులేటి శ్రీనీవాస్ రెడ్డి చెప్పారు. 2016లో జీవో.. అమలు మాత్రం శూన్యం యూఎల్‌సీ సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వం 2016లో జీవో జారీ చేసినప్పటికీ, ఆ జీవోను అమలు చేయకపోవడంతో ఏళ్ల తరబడి దరఖాస్తులు పెండింగ్ లోనే ఉన్నాయని అన్నారు.
ఈ నెల 16న శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్షన్ 22Aతో ముడిపడి ఉన్న 10–12 కీలక అంశాలను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరిస్తామని ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 22A సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత జి.ఓ 118కు అనుగుణంగా మెమో జారీ, ఆ వెంటనే జి .ఓ 76కు అనుగుణంగా మెమో ఇవ్వడం జరిగిందన్నారు. 22ఏ లో ఉన్నప్పటికీ GHMC, HMDA, DTCP, మున్సిపల్ అనుమతులు కలిగిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తూ ఉత్తరులు జారీ చేశామన్నారు.
{{/usCountry}}ఈ నెల 16న శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్షన్ 22Aతో ముడిపడి ఉన్న 10–12 కీలక అంశాలను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరిస్తామని ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 22A సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత జి.ఓ 118కు అనుగుణంగా మెమో జారీ, ఆ వెంటనే జి .ఓ 76కు అనుగుణంగా మెమో ఇవ్వడం జరిగిందన్నారు. 22ఏ లో ఉన్నప్పటికీ GHMC, HMDA, DTCP, మున్సిపల్ అనుమతులు కలిగిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తూ ఉత్తరులు జారీ చేశామన్నారు.
{{/usCountry}}తాజాగా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చామన్నారు. మిగిలిన అన్ని సమస్యలకు వేగవంతమైన పరిష్కారం చూపిస్తామని తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యల నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తామని, వారికి ఇబ్బందులు కలిగిస్తున్న ప్రతి భూ సమస్యను పరిశీలించి, చట్టం, నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించడమే తమ ప్రభుత్వ ప్రథమ లక్ష్యం అన్నారు.