...
...
Next Story

ప్రభుత్వ పాఠశాలలో దారుణం.. బాలికల వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా!

తెలంగాణలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలోని బాలికల టాయిలెట్‌లో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసినట్టుగా గుర్తించారు.

Published on: Oct 28, 2025, 11:08:35 IST
Advertisement

కరీంనగర్ జిల్లాలో కురిక్యాల పాఠశాలలో షాకింగ్ ఘటన జరిగింది. పాఠశాల అటెండర్ బాలికల వాష్ రూమ్‌లో సీక్రెట్ కెమెరాను ఏర్పాటు చేశాడు. హెడ్ మాస్టర్ ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతమంది బాలికలు వాష్‌రూమ్‌లో అనుమానాస్పదంగా వెలుగుతున్న కెమెరా పరికరాన్ని గమనించి దాని గురించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఈ దారుణం చేసింది పాఠశాల అటెండర్ యాకూబ్‌గా గుర్తించారు. ఈ విషయాన్ని బాలికలు గుర్తించి తల్లిదండ్రులకు చెప్పారు. తల్లిదండ్రులు హెడ్‌మాస్టర్‌కు ఫిర్యాదు చేశారు. సబ్-ఇన్‌స్పెక్టర్ వంశీ కృష్ణ, చొప్పదండి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ కుమార్‌లకు హెడ్‌మాస్టర్ సమాచారం అందించగా, వారు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు పాఠశాల పరిసరాల్లో ఆధారాలు సేకరించారు.

ఈ సంఘటనపై నివేదికను జిల్లా కలెక్టర్‌కు, తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖకు పంపామని పై అధికారుల ఆదేశాలను పాఠశాల పాటిస్తుందని హెడ్‌మాస్టర్ మీడియాకు తెలిపారు.

మరోవైపు అటెండర్ యాకూబ్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపడుతున్నారు. పాఠశాలలో ఇలాంటి ఘటన జరగడంతో తల్లిదండ్రులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ పని చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని చెప్పారు.

గతంలోనూ 2025 జనవరిలో మేడ్చల్‌లోని సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఇలాంటి సంఘటన జరిగింది. ఆ సంఘటనలో క్యాంపస్‌లోని ఒక హాస్టల్‌లోని బాత్‌రూమ్‌లలో రహస్య కెమెరాలు కనిపించినట్టుగా విద్యార్థినులు చెప్పారు. దీనితో అప్పుడు కళాశాల క్యాంపస్ లోపల పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద క్యాంపస్‌ను సందర్శించి, హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ బాత్రూమ్‌ల వెంటిలేటర్ల గ్లాసులపై లభించిన వేలిముద్రల ఆధారంగా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks