ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్డేట్.. బిల్లు చెల్లింపుల్లో మార్పులు చేసిన ప్రభుత్వం!
ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కీలక అప్డేట్ వచ్చింది. బిల్లు చెల్లింపుల విషయంలో స్వల్ప మార్పులు చేసినట్టుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో బిల్లుల విషయంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఈ మేరకు ఆ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇళ్ల నిర్మాణంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 90 పని దినాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పనులు చేసుకోవాలని కేంద్రం అనుమతి ఇచ్చిందని, అందుకే బిల్లుల విషయంలో మార్పులు తప్పనిసరి అని మంత్రి పొంగులేటి వెల్లడించారు. అయితే బిల్లులకు సంబంధించిన షెడ్యూల్‌లో మాత్రమే మార్పులు ఉంటాయని, రూ.5లక్షలు చెల్లింపుల విషయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.

ప్రస్తుతం చూసుకుంటే ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో భాగంగా ముదటి, రెండో దశ పనులు అయ్యాక.. రూ.లక్ష చొప్పున లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తోంది ప్రభుత్వం. ఈ రెండు దశ చెల్లింపుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ మూడో దశలో చెల్లించే రూ.2లక్షల చెల్లింపుల్లో మార్పులు ఉంటాయి. ఇందులో మార్పు ప్రకారం.. రూ.1.60 లక్షలు అందిస్తారు. తర్వాత దశల్లో మిగిలిన డబ్బును జమ చేస్తారు. పరిపాలన సౌలభ్యం కోసం ఈ మార్పును చేసినట్టుగా ప్రకటించారు మంత్రి పొంగులేటి. ఈ విషయాన్ని గమనించి లబ్ధిదారులు సహకరించాలన్నారు. రూ.5లక్షల చెల్లింపులో మార్పు ఉండదని మరోసారి స్పష్టం చేశారు.
మరోవైపు చాలా మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయినా నిర్మాణాలు ముదలుపెట్టలేదు. వారిపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టిపెట్టినట్టుగా తెలుస్తోంది. అర్హులైన పేద కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది ప్రభుత్వం. కానీ చాలా మంది మంజూరైన ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం లేదు. ఇందుకోసం గ్రేస్ పిరియడ్ పెట్టింది ప్రభుత్వం. ప్రభుత్వం ప్రకారం ఇంటి స్థలాన్ని మార్కింగ్ చేసిన 45 రోజుల్లోగా నిర్మాణ పనులు చేపట్టాలి.
కానీ చాలా మంది లబ్ధిదారులు ఈ గడువు దాటిపోయినా.. నిర్మాణాలు ముదలుపెట్టలేదు. అలాంటి వారికి మరో 15 రోజులు సమయం ఇచ్చింది. అయినా లబ్ధిదారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక ఈ నెలాఖరులోగా నిర్మాణాలు ముదలుపెట్టని... వారి నుంచి అంగీకార పత్రం తీసుకుంటుంది ప్రభుత్వ. వారి గృహ నిర్మాణ మంజూరును రద్దు చేసేందుకు యోచిస్తోంది. దీంతో రద్దైన ఇళ్లను అవసరం ఉన్నవారికి కేటాయిస్తారు. అయితే నిర్మాణాలు ముదలుపెట్టకపోవడానికి లబ్ధిదారులు అనేక కారణాలు చెబుతున్నారు. డబ్బుల లేకపోవడం, అప్పులు తీసుకురావాల్సి వస్తుండటంలాంటి కారణాలను వివరిస్తున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


