...
...
Next Story

ఈనెల 10 నుంచి బతుకమ్మ వేడుకలు - ట్యాంక్‌బండ్‌పై ఘనంగా సద్దుల బతుకమ్మ

తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను అక్టోబర్ 10 నుంచి 18 వరకు వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. సద్దుల బతుకమ్మ రోజున ట్యాంక్ బండ్‌పై వేలాది మంది మహిళలతో మహా ఉత్సవం జరగనుంది.

Published on: Oct 3, 2026, 17:43:00 IST
Advertisement

తెలంగాణ సాంస్కృతిక వైభవానికి నిదర్శనమైన బతుకమ్మ పూల పండుగను ఈ నెల 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ వేడుకల నిర్వహణ, భద్రత, కల్పించాల్సిన వసతులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల కార్యదర్శులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈనెల 10 నుంచి బతుకమ్మ వేడుకలు
ఈనెల 10 నుంచి బతుకమ్మ వేడుకలు

ఈ సమీక్ష అనంతరం సీఎస్ మాట్లాడారు. ఈ నెల 18న జరిగే 'సద్దుల బతుకమ్మ' ను పురస్కరించుకుని ట్యాంక్ బండ్‌పై వేలాది మంది మహిళల భాగస్వామ్యంతో గ్రాండ్ ఫినాలే నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

రహదారులపై సంస్కృతిక శోభ, ప్రదర్శనలు….

సద్దుల బతుకమ్మ రోజున సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారక కేంద్రం నుంచి వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ర్యాలీగా బయలుదేరుతారు. వీరితో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే వందలాది మంది కళాకారులు తమ జానపద కళారూపాలతో ప్రదర్శనలు ఇస్తూ ట్యాంక్ బండ్ చేరుకుంటారు. ట్యాంక్ బండ్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసే వేదికపై ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరుకానున్నారు.

హైదరాబాద్ నగరం మొత్తంలో పండగ శోభ ఉట్టిపడేలా ప్రధాన కూడళ్లలో బతుకమ్మ నమూనాలను, విద్యుత్ దీపాల అలంకరణలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రత్యేకంగా విద్యుత్ అలంకరణలు చేయనున్నారు.

సమీప బస్తీలు, కాలనీల నుంచి మహిళలు పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్‌కు వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎమ్‌‌డీఏ అధికారులను హెచ్చరించారు. చిల్డ్రన్స్ పార్క్ లోని బతుకమ్మ ఘాట్ తో పాటు నెక్లెస్ రోడ్డు పరిసరాల్లో నిమజ్జనానికి ప్రత్యేక క్యూలైన్లు, ఘాట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు.

భద్రత, రవాణా ఏర్పాట్లు……

ఈ తొమ్మిది రోజుల పాటు రవీంద్రభారతితో పాటు రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక కేంద్రాల్లో కూడా బతుకమ్మ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈసారి బతుకమ్మ వేడుకల కోసం ప్రత్యేకంగా రూపొందించిన లోగోను త్వరలోనే ఆవిష్కరించనున్నారు. రాబోయే డిసెంబర్‌లో నిర్వహించనున్న "తెలంగాణ గ్లోబల్ సమ్మిట్" ప్రచారాన్ని కూడా ఈ లోగోలో భాగం చేయనున్నట్లు సీఎస్ సంజయ్ జాజు వివరించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks