హైదరాబాద్ మెట్రో ఫేజ్ IIకు వెంటనే ఆమోదం తెలపండి.. కేంద్రానికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ఫేజ్ IIకు వెంటనే ఆమోదం తెలపాలని కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రెండో దశ డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్రానికి సమర్పించామని చెప్పారు.

Published on: May 7, 2026, 06:18:57 IST
By , Delhi
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు ఆమోదం తెల‌పాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప‌ట్టణ వ్యవ‌హారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఏడు కారిడార్లతో కూడిన మెట్రో ఫేజ్‌-II స‌మ‌గ్ర ప్రణాళిక‌ను రూపొందించి డీపీఆర్‌ను ఇప్పటికే స‌మ‌ర్పించామ‌ని తెలిపారు.

కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సీఎం రేవంత్ రెడ్డి
కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖ‌ట్టర్‌‌తో సమావేశమయ్యారు. ఈ సంద‌ర్భంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్‌ -II, మెట్రో ఫేజ్‌ -III పై చ‌ర్చించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్రయాణికుల సౌక‌ర్యార్థం మెట్రోను మ‌రింత‌గా విస్తరించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు.

హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ -II, ఫేజ్‌ -III విస్తర‌ణ స‌జావుగా సాగాల‌నే ఉద్దేశంతోనే మెట్రో ఫేజ్‌-Iను L అండ్ TMRHL ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంద‌ని వివ‌రించారు. ప్రస్తుతం ఫేజ్-I ప్రభుత్వం ప‌రిధిలో ఉండ‌డంతో ఫేజ్‌-II, ఫేజ్‌-III విస్తరణ సులుభమవుతుందని చెప్పారు.

మెట్రోరైల్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్ -IIలో ఏడు కారిడార్లతో మొత్తం 122.9 కి.మీ మేర విస్తరణకు, రూ. 38,595 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన సమగ్ర డీపీఆర్‌ను ఇప్పటికే స‌మ‌ర్పించిన విషయాన్ని గుర్తుచేశారు.

హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ -II ప్రాజెక్ట్‌ను భారత ప్రభుత్వం - తెలంగాణ ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా చేప‌ట్టేందుకు త్వర‌గా ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు. హైద‌రాబాద్ న‌గ‌ర భ‌విష్యత్ అవ‌స‌రాల దృష్ట్యా ఆర్జీఐ ఎయిర్‌పోర్ట్ - భారత్ ఫ్యూచర్ సిటీ కారిడార్‌ను మెట్రో ఫేజ్ -III గా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మెట్రో ఫేజ్-III కి సంబంధించిన డీపీఆర్‌ను కూడా ఇప్పటికే స‌మ‌ర్పించామ‌ని తెలిపారు.

స‌మావేశంలో మినిస్ట్రీ ఆఫ్ హౌజింగ్ అర్బన్ శాఖ కార్యద‌ర్శి కె. శ్రీ‌నివాస్‌, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యద‌ర్శి బి.అజిత్ రెడ్డి, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ స‌ర్ఫరాజ్ అహ్మద్‌, రాష్ట్ర ప్రభుత్వ స‌ల‌హాదారు(ప‌ట్టణ ర‌వాణా) ఎన్‌.వి.ఎస్‌.రెడ్డి, ఢిల్లీ తెలంగాణ భ‌వ‌న్ ప్రత్యేకాధికారి సంజ‌య్ కుమార్‌, కేంద్ర ప్రభుత్వ ప‌థ‌కాల స‌మ‌న్వయ కార్య‌ద‌ర్శి అద్వైత్ కుమార్ సింగ్‌తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More