తెలంగాణలో భూగర్భ జలాలు ఊహించని రీతిలో అడుగంటిపోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత ఏడాది అక్టోబర్ నాటితో పోలిస్తే, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి నగర పరిధిలోని ప్రధాన కార్పొరేషన్లలో నీటి మట్టాలు అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. గతేడాది సెప్టెంబర్‌లో భూగర్భ జలాల సగటు లోతు 4.73 మీటర్లు ఉండగా ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి అది ఏకంగా 11.58 మీటర్లకు పడిపోయింది. అంటే ఒక్క ఏడాది వ్యవధిలోనే సగటున 6.85 మీటర్ల మేర భూగర్భ జలాలు క్రమంగా క్షీణించాయి.

ఎల్ నినో ప్రభావం, వర్షపాతంలో మార్పులు, నీటి వాడకం విపరీతంగా పెరగడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని భూగర్భ జల వనరుల శాఖ సమర్పించిన నివేదిక స్పష్టం చేస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 46 మండలాల్లో భూగర్భ జల శాఖ నిర్వహించిన సర్వే ఆధారంగా అత్యంత తక్కువ, ఉత్తమ నీటి మట్టాలు ఉన్న ప్రాంతాల వివరాలు చూడండి.
అత్యంత తీవ్రంగా నీటి మట్టాలు పడిపోయిన ప్రాంతాలు.. కూకట్‌పల్లి (మేడ్చల్): 20.67 మీటర్ల లోతు (అత్యంత దారుణంగా నీరు పడిపోయిన ప్రాంతం). హయాత్‌నగర్ (రంగారెడ్డి): 19.46 మీటర్ల లోతు, శంకర్ పల్లి (రంగారెడ్డి): 19.25 మీటర్ల లోతు, మేడిపల్లి (మేడ్చల్): 18.23 మీటర్ల లోతు, మల్కాజిగిరి (మేడ్చల్): 17.11 మీటర్లు పడిపోయాయి.
భూగర్భ జలాలు మెరుగ్గా ఉన్న ప్రాంతాలు చూసుకుంటే.. షేక్‌పేట్: 1.87 మీటర్లు, హిమాయత్‌నగర్: 2.90 మీటర్లు, అమీన్‌పూర్: 3.00 మీటర్లతో కాస్త మెరుగ్గా ఉన్నాయి.
కొన్ని కీలక ప్రాంతాల్లో పీజోమీటర్ల ద్వారా నమోదు చేసిన గణాంకాల ప్రకారం భూగర్భ జలాలు అడుగుకి పడిపోయిన తీవ్రత వెల్లడవుతోంది. కూకట్‌పల్లి పరిధిలో ఎంఆర్‌ఓ ఆఫీస్ వద్ద 47.23 మీటర్లు, కేపీహెచ్‌బీలో 28.78 మీటర్లు, కూకట్‌పల్లిలో 23.38 మీటర్ల లోతుకు పడిపోయింది.
హయాత్‌నగర్: ఆటోనగర్‌లో 37.71 మీటర్లు, హయాత్‌నగర్ సెంటర్లో 15.92 మీటర్లు, కుతుబుల్లాపూర్-2 లో 37 మీటర్లు, జీడిమెట్లలో 20.19 మీటర్లు, గాజులరామారంలో 23.24 మీటర్లు, చెంగిచర్ల సబ్‌స్టేషన్ వద్ద 25.70 మీటర్లు, మేడిపల్లి టౌన్లో 19.87 మీటర్లు భూగర్భ జలాలు పడిపోయాయి. అమీర్‌పేట్ ఎస్ఆర్ నగర్లో 19.77 మీటర్లు, ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ వద్ద 13.81 మీటర్లుగా నమోదయ్యాయి.
{{/usCountry}}హయాత్‌నగర్: ఆటోనగర్‌లో 37.71 మీటర్లు, హయాత్‌నగర్ సెంటర్లో 15.92 మీటర్లు, కుతుబుల్లాపూర్-2 లో 37 మీటర్లు, జీడిమెట్లలో 20.19 మీటర్లు, గాజులరామారంలో 23.24 మీటర్లు, చెంగిచర్ల సబ్‌స్టేషన్ వద్ద 25.70 మీటర్లు, మేడిపల్లి టౌన్లో 19.87 మీటర్లు భూగర్భ జలాలు పడిపోయాయి. అమీర్‌పేట్ ఎస్ఆర్ నగర్లో 19.77 మీటర్లు, ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ వద్ద 13.81 మీటర్లుగా నమోదయ్యాయి.
{{/usCountry}}భూగర్భ జలాలు పడిపోవడం వల్ల ప్రజలు మరింత లోతైన బోర్‌వెల్లు తవ్వాల్సి వస్తుందని, ఇది భూగర్భ జలాలను మరింత వేగంగా ఖాళీ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎండిపోయిన చెరువులు, సరస్సులను పునరుద్ధరించడం ద్వారా మాత్రమే నీటిమట్టాలను మళ్లీ పెంచవచ్చని పేర్కొన్నారు. మురుగునీటి శుద్ధి కేంద్రాల నుండి వచ్చే శుద్ధి చేసిన నీటిని చెరువుల్లోకి మళ్లించాలని సూచించారు. అలాగే మొక్కలకు ఉదయం, సాయంత్రం వేళల్లో నీళ్లు పోయడం, వాషింగ్ మెషీన్‌ను పూర్తి లోడ్‌తో రెండు మూడు రోజులకోసారి వాడటం వల్ల నీటి వృథాను అరికట్టవచ్చు.