తెలంగాణలో పడిపోతున్న భూగర్భ జలాలు.. ఇక్కడ ఏడాదిలోనే 6.85 మీటర్ల మేర పతనం
రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఇక హైదరాబాద్‌లో లెక్కలు చూస్తే మాత్రం షాకింగ్‌గా ఉంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి రావొచ్చు.
తెలంగాణలో భూగర్భ జలాలు ఊహించని రీతిలో అడుగంటిపోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత ఏడాది అక్టోబర్ నాటితో పోలిస్తే, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి నగర పరిధిలోని ప్రధాన కార్పొరేషన్లలో నీటి మట్టాలు అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. గతేడాది సెప్టెంబర్‌లో భూగర్భ జలాల సగటు లోతు 4.73 మీటర్లు ఉండగా ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి అది ఏకంగా 11.58 మీటర్లకు పడిపోయింది. అంటే ఒక్క ఏడాది వ్యవధిలోనే సగటున 6.85 మీటర్ల మేర భూగర్భ జలాలు క్రమంగా క్షీణించాయి.

ఎల్ నినో ప్రభావం, వర్షపాతంలో మార్పులు, నీటి వాడకం విపరీతంగా పెరగడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని భూగర్భ జల వనరుల శాఖ సమర్పించిన నివేదిక స్పష్టం చేస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 46 మండలాల్లో భూగర్భ జల శాఖ నిర్వహించిన సర్వే ఆధారంగా అత్యంత తక్కువ, ఉత్తమ నీటి మట్టాలు ఉన్న ప్రాంతాల వివరాలు చూడండి.
అత్యంత తీవ్రంగా నీటి మట్టాలు పడిపోయిన ప్రాంతాలు.. కూకట్పల్లి (మేడ్చల్): 20.67 మీటర్ల లోతు (అత్యంత దారుణంగా నీరు పడిపోయిన ప్రాంతం). హయాత్‌నగర్ (రంగారెడ్డి): 19.46 మీటర్ల లోతు, శంకర్ పల్లి (రంగారెడ్డి): 19.25 మీటర్ల లోతు, మేడిపల్లి (మేడ్చల్): 18.23 మీటర్ల లోతు, మల్కాజిగిరి (మేడ్చల్): 17.11 మీటర్లు పడిపోయాయి.
భూగర్భ జలాలు మెరుగ్గా ఉన్న ప్రాంతాలు చూసుకుంటే.. షేక్‌పేట్: 1.87 మీటర్లు, హిమాయత్‌నగర్: 2.90 మీటర్లు, అమీన్పూర్: 3.00 మీటర్లతో కాస్త మెరుగ్గా ఉన్నాయి.
కొన్ని కీలక ప్రాంతాల్లో పీజోమీటర్ల ద్వారా నమోదు చేసిన గణాంకాల ప్రకారం భూగర్భ జలాలు అడుగుకి పడిపోయిన తీవ్రత వెల్లడవుతోంది. కూకట్పల్లి పరిధిలో ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద 47.23 మీటర్లు, కేపీహెచ్బీలో 28.78 మీటర్లు, కూకట్‌పల్లిలో 23.38 మీటర్ల లోతుకు పడిపోయింది.
హయాత్‌నగర్: ఆటోనగర్‌లో 37.71 మీటర్లు, హయాత్‌నగర్ సెంటర్లో 15.92 మీటర్లు, కుతుబుల్లాపూర్-2 లో 37 మీటర్లు, జీడిమెట్లలో 20.19 మీటర్లు, గాజులరామారంలో 23.24 మీటర్లు, చెంగిచర్ల సబ్‌స్టేషన్ వద్ద 25.70 మీటర్లు, మేడిపల్లి టౌన్లో 19.87 మీటర్లు భూగర్భ జలాలు పడిపోయాయి. అమీర్‌పేట్ ఎస్ఆర్ నగర్లో 19.77 మీటర్లు, ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ వద్ద 13.81 మీటర్లుగా నమోదయ్యాయి.
భూగర్భ జలాలు పడిపోవడం వల్ల ప్రజలు మరింత లోతైన బోర్వెల్లు తవ్వాల్సి వస్తుందని, ఇది భూగర్భ జలాలను మరింత వేగంగా ఖాళీ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎండిపోయిన చెరువులు, సరస్సులను పునరుద్ధరించడం ద్వారా మాత్రమే నీటిమట్టాలను మళ్లీ పెంచవచ్చని పేర్కొన్నారు. మురుగునీటి శుద్ధి కేంద్రాల నుండి వచ్చే శుద్ధి చేసిన నీటిని చెరువుల్లోకి మళ్లించాలని సూచించారు. అలాగే మొక్కలకు ఉదయం, సాయంత్రం వేళల్లో నీళ్లు పోయడం, వాషింగ్ మెషీన్‌ను పూర్తి లోడ్‌తో రెండు మూడు రోజులకోసారి వాడటం వల్ల నీటి వృథాను అరికట్టవచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


