Rohit Reddy : మాజీ ఎమ్మెల్యే రోహిత్​ రెడ్డి ఫామ్​ హౌస్​లో కాల్పుల మోత- డ్రగ్స్​ సీజ్!

Pilot rohit reddy : తెలంగాణ మాజీ ఎమ్మెల్యే రోహిత్​ రెడ్డి ఫామ్​ హోస్​లో కాల్పుల కలకలం రేగింది. ఘటనాస్థలం నుంచి డ్రగ్స్​ని సీజ్​ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. కాగా డ్రగ్స్​ టెస్ట్​లో రోహిత్​ రెడ్డికి నెగిటివ్​ వచ్చినట్టు స్పష్టం చేశారు. 

Published on: Mar 15, 2026 7:48 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ రంగారెడ్డి జిల్లాలోని ఓ ఫామ్​ హౌస్​లో శనివారం రాత్రి వేళ కాల్పుల మోత మోగింది. ఈ ఫామ్​ హౌస్​.. బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్​ రెడ్డికి చెందినది అని పోలీసులు వెల్లడించారు.

మాజీ ఎమ్మెల్యే రోహిత్​ రెడ్డి ఫామ్​ హౌస్​లో కాల్పులు..
మాజీ ఎమ్మెల్యే రోహిత్​ రెడ్డి ఫామ్​ హౌస్​లో కాల్పులు..

పోలీసులు తెలియజేసిన సమాచారం ప్రకారం.. ఈ ఫామ్​ హౌస్​ మోయినాబాద్​ అజీజ్​నగర్​ ప్రాంతంలో ఉంది. ఇక్కడ మద్యం, డ్రగ్స్​ పార్టీ నడుస్తోందని అధికారులకు సమాచారం అందింది. శనివారం రాత్రి 9 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఫామ్​ హైస్​పై స్థానిక పోలీసులతో పాటు ఈగల్​ టీమ్​, ఎస్​ఓటీ దాడులు చేశారు. పోలీసులను చూసిన వెంటనే భయంతో చాలా మంది ఉలిక్కిపడ్డారు. వారిలో ఒకరు కాల్పులకు పాల్పడ్డారు.

ఈ పార్టీలో చాలా మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. వారిలో కొందరి పేర్లను పోలీసులు వెల్లడించారు.

మాజీ ఎమ్మెల్యే రోహిత్​ రెడ్డి, రియల్​ ఎస్టేట్​ వ్యాపారి నమీద్​ మిశ్రా, ఆంధ్రప్రదేశ్​కి చెందిన ఏలురు ఎంపీ పుట్టా మహేశ్​ కుమార్​ యాదవ్​, యం రమేశ్​, విజయ్​ కృష్ణ, కాసిక్​ రవి, రితేశ్​ రెడ్డి, అర్జున్​ రెడ్డి తదితరులు ఈ ఫామ్​ హౌస్​లో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. వీరితో పాటు ఒక మహిళ కూడా ఉన్నట్టు వివరించారు.

ఈ పార్టీపై దాడి చేసిన అనంతరం అక్కడి నుంచి 2 గ్రాముల వైట్​ పౌడర్​ను అధికారులు సీజ్​ చేశారు. పరీక్షల్లో అది డ్రగ్సే అని తేలింది.

కాగా పార్టీలో చిక్కిన వారికి పోలీసులు డ్రగ్స్​ కిట్​తో టెస్టింగ్​ నిర్వహించారు. రోహిత్​ రెడ్డి, రితేశ్​ రెడ్డి, నమీద్​ మిశ్రా, కాసిక్​ రవితో పాటు అర్జున్​ రెడ్డికి ఈ టెస్టింగ్​లో పాజిటివ్​గా వచ్చిందని పోలీసులు వెల్లడించారు. తదుపరి నిర్థరణ కోసం శాంపిల్స్​ని హాస్పిటల్​కి పంపించినట్టు వివరించారు.

అయితే ఫామ్​ హౌస్​లో డ్రగ్స్​ తీసుకోలేదని పట్టుబడ్డ కొందరు చెబుతున్నారు. గత వారం సిమ్లా, గోవాలో డ్రగ్స్​ తీసుకున్నట్టు పోలీసులకు చెప్పారు.

ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టినట్టు, మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చేవేళ్ల డీసీపీ యోగేశ్​ గౌతమ్​ వెల్లడించారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More