సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు హెల్త్ చెకప్‌లు చేయాలి.. ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ తీసుకురావాలి : సీఎం రేవంత్

రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యార్థులకు అందుతోన్న పౌష్టిక ఆహారం, వారి ఆరోగ్య పరిస్థితులపై పీరియాడికల్ గా హెల్త్ చెకప్‌లు చేయాలన్నారు.

Published on: Oct 13, 2025, 18:15:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, సంక్షేమశాఖలపై కమాండ్‌ కంట్రోల్‌ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. తెలంగాణలోని సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. విద్యార్థులకు అందుతోన్న పౌష్టిక ఆహారం, వారి ఆరోగ్య పరిస్థితుల‌పై పీరియాడికల్‌గా హెల్త్ చెకప్‌లు చేయాలని ఆదేశించారు. హాస్టళ్లలో విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని పూర్తిగా ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ పరిధిలోకి తీసుకురావాలని చెప్పారు రేవంత్ రెడ్డి. విద్యార్థులకు అందించే భోజనం క్వాలిటీ చెక్‌కు టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

'సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. హాస్టళ్లలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి ఫేస్ రికగ్నిషన్ విధానం అమలు చేయాలి. పూర్తి డేటాతో సంక్షేమ హాస్టళ్ల వ్యవస్థలో జవాబుదారీతనం ఉండేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు అందే భోజనం నాణ్యతను సాంకేతికతతో పరీక్షించాలి. ఇందులో భాగంగా విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలి.' అని రేవంత్ రెడ్డి ఆదేశించారు.

హాస్టళ్లలో విద్యార్థులకు అందించే దుస్తులు, పుస్తకాలు, వారికి చేరుతున్నాయా లేదో చూసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రతీ హాస్టల్‌‌లో మౌలిక సదుపాయాలపై పూర్తి స్థాయి డేటాను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలన్నారు.

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చెప్పారు. వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక విధానాన్ని అనుసరించాలని స్పష్టం చేశారు. హాస్టళ్లపై సమీపంలోని వైద్య కళాశాలలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు అనుసంధానం చేయాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు హాస్టళ్లను సందర్శించి ఆరోగ్య తనిఖీలు చేయాలని స్పష్టం చేశారు. హాస్టళ్లకు సంబంధించి.. ప్రతీ నెలా గ్రీన్ ఛానెల్‌లో నిధులు అందేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More