AP Telangana Weather Updates : గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు… వాతావరణం ఒక్కసారిగా చల్లబడటం ఊరటనిచ్చింది. తెలంగాణలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పలు జిల్లాల్లో వాతావరణం వేగంగా మారిపోయింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం తెలంగాణను ముంచెత్తింది. అకాల వర్షమే అయినప్పటికీ…. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న విపరీతమైన ఉష్ణోగ్రతల నుండి ఈ వాన కాస్త ఉపశమనం కలిగించింది.

తెలంగాణవ్యాప్తంగా నమోదైన వర్షపాత వివరాలను గమనిస్తే…. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వాన దంచికొట్టింది. అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లా కొత్తమొల్గరలో రికార్డు స్థాయిలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే జిల్లాలోని పర్పల్లిలో 10 సెంటీమీటర్లు, భూత్పూర్‌లో 10 సెంటీమీటర్ల మేర భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్ సిటీలో సైతం 7.5 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది.
మహబూబ్‌నగర్‌తో పాటు పక్కనే ఉన్న ఇతర దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనూ వాన జోరు కొనసాగింది. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేటలో 8.8 సెంటీమీటర్లు, వనపర్తి జిల్లా అమరచింతలో 8.6 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడింది.
మరోవైపు ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లోనూ అర్ధరాత్రి వాన పలకరించింది. సిద్దిపేట జిల్లా అంగడ కిష్టాపూర్‌లో 6.5 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా డిండిలో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా హత్నూరలో 6 సెంటీమీటర్లు, నిజామాబాద్ జిల్లా దర్పల్లిలో 5.4 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్‌తో పాటు కామారెడ్డి జిల్లాలోని దోమకొండ, సదాశివనగర్ ప్రాంతాల్లో ఐదేసి (5) సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
అకస్మాత్తుగా అర్ధరాత్రి వేళ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడటంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే.. ఎండ తీవ్రతతో అల్లాడుతున్న జనాలకు ఈ వాన వాతావరణాన్ని ఒక్కసారిగా చల్లబరిచింది. హైదరాబాద్ సిటీలోని చాలా ప్రాంతాల్లోనూ అర్ధరాత్రి వర్షం పడింది. ఇవాళ ఉదయం నుంచి వాతావరణం చల్లగా ఉంది.
మరికొన్ని రోజులు వర్షాలు..!
{{/usCountry}}అకస్మాత్తుగా అర్ధరాత్రి వేళ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడటంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే.. ఎండ తీవ్రతతో అల్లాడుతున్న జనాలకు ఈ వాన వాతావరణాన్ని ఒక్కసారిగా చల్లబరిచింది. హైదరాబాద్ సిటీలోని చాలా ప్రాంతాల్లోనూ అర్ధరాత్రి వర్షం పడింది. ఇవాళ ఉదయం నుంచి వాతావరణం చల్లగా ఉంది.
మరికొన్ని రోజులు వర్షాలు..!
{{/usCountry}}హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం (IMD) విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. మే 28 నుంచి మే 31 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాల్పులతో పాటు ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మే 28 ఉదయం నుంచి మే 29 ఉదయం వరకు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉంది. అదే సమయంలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో రాత్రి వేళల్లోనూ వేడి వాతావరణం ఉండే సూచనలున్నాయి.
ఎండలతో పాటు రాష్ట్రంలో ఆకస్మిక వాతావరణ మార్పులు కూడా సంభవించనున్నాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు దాదాపు అన్ని జిల్లాల్లో అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ముఖ్యంగా మే 29, 30, 31 తేదీల్లో మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి తదితర జిల్లాల్లో ఈదురు గాలుల తీవ్రత ఎక్కువగా ఉండనుంది.
ఏపీ వెదర్ రిపోర్ట్: ఎండలు, ఆకస్మిక వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత, వడగాల్పులు విపరీతంగా పెరుగుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిది. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత కఠినంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది.
మే 27 (ఇవాళ) రాష్ట్రంలోని దాదాపు 68 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే ప్రమాదం ఉంది. దీనితో పాటు మరో 93 మండలాల్లో సాధారణ వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం గుంటూరు జిల్లా ములుకుదురులో అత్యధికంగా 47.7°C గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, పల్నాడు జిల్లా గురజాలలో 47.6°C ఉష్ణోగ్రత నమోదైంది.
జిల్లాల వారీగా గరిష్ట ఉష్ణోగ్రతల అంచనా:
- పోలవరం,కోనసీమ,పశ్చిమగోదావరి,ఏలూరు : 45°C - 47°C
- ఉత్తరాంధ్ర,కృష్ణా,గుంటూరు,పల్నాడు,ప్రకాశం : 42°C - 44°C
- రాయలసీమ,నెల్లూరు,కాకినాడ : 40°C - 42°C
తీవ్రమైన ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పనులపై బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
మరోవైపు ఆకస్మిక వర్షాలు, ఈదురు గాలులు వచ్చే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్ కింద నిలబడకూడదు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలి.