తెలుగు రాష్ట్రాల్లో రాగల కొన్ని రోజుల్లో వాతావరణం మారనుంది. ఆకాశంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తెలంగాణలో ఈదురుగాలులు, భారీ వర్షాలు:

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం…. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
- ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కొనసాగుతాయి. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
- రేపు రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయి. ఉత్తర, మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వానలు కురిసే అవకాశముంది.
- సెప్టెంబర్ 11, 12 తేదీల్లో ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు.
- వర్షాలు కురిసే సమయంలో తడిసిన రోడ్లు, డ్రైనేజీలు, వేలాడే విద్యుత్ తీగల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని సూచించారు.
ఏపీ వెదర్ రిపోర్ట్ :
ఉత్తరాంధ్రతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు.
అలాగే అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదని అధికారులు హెచ్చరించారు.