తెలుగు రాష్ట్రాలపై ద్రోణి ప్రభావం - ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు!
AP Telangana Weather Updates : ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు వర్ష సూచన జారీ అయింది.
AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇవాళ (సెప్టెంబర్ 7) ఉక్కపోత, ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ… మధ్యాహ్నం నుంచి వాతావరణం చల్లబడి పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ వాతావరణ సమాచారం…
ద్రోణి ప్రభావంతో సోమవారం(సెప్టెంబర్ 7) పలు జిల్లాల్లో వాతావరణంలో మార్పులు వస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున వర్షం పడే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడకూడదని అధికారులు సూచించారు.
ఇక ఆదివారం రాజమహేంద్రవరంలో సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం పడటంతో… రోడ్లన్నీ జలమయయ్యాయి. వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు
తెలంగాణ వెదర్ రిపోర్ట్…
తెలంగాణ వెదర్ మ్యాన్ రిపోర్ట్ ప్రకారం… ఇవాళ పగటిపూట విపరీతమైన ఉక్కపోత ఉండే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత వాతావరణం మారొచ్చు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చు.
సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి భువనగిరి, మెదక్, సిద్దిపేట, జనగామ, కామారెడ్డి, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి సమయంలో చెదురుమదురుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి.
నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నారాయణపేట, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు మోస్తరు నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా ఒక్కసారిగా తేలికపాటి వర్షాలు కురుస్తాయి.
హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి సమయంలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని… వర్షం పడే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

