మురసు తుపాను : తెలంగాణలో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం

Cyclone Murasu : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మురసు తుపానుగా బలపడింది. నవంబర్ 3న ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటవచ్చని అంచనా. రాబోయే రోజుల్లో తెలంగాణలో వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

Published on: Nov 1, 2026, 17:30:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

భారత వాతావరణ శాఖ బులెటిన్‌ ప్రకారం, మురసు తుపాను కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. ఈ తుపాను మరింత బలం పుంజుకుని గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులతో నవంబర్ 3వ తేదీ ఉదయానికల్లా నెల్లూరు-నర్సాపూర్ మధ్య తీవ్ర తుపానుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటవచ్చని అంచనా. తుపాను ఆంధ్ర తీరం వైపు దూసుకువస్తుండగా దాని దట్టమైన మేఘాల ఇప్పటికే విస్తరించాయి.

తెలంగాణలో వానలు
తెలంగాణలో వానలు

రాబోయే కొద్ది రోజులు తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. మురసు ప్రభావంతో నవంబర్ 1 నుంచి వర్షాలు ప్రారంభమై వారం మధ్యలో మరింత భారీగా కురుస్తాయని ఐఎండి హైదరాబాద్ తెలిపింది. నవంబర్ 1 ఆదివారం నాడు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ సూచనలో తెలిపింది.

సోమ, మంగళవారాల్లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి సహా తెలంగాణలోని తూర్పు, దక్షిణ జిల్లాలకు హైదరాబాద్‌లోని ఐఎండీ భారీ వర్ష హెచ్చరిక జారీ చేసింది. రాబోయే కొద్ది రోజుల్లో హైదరాబాద్ రాజధాని ప్రాంతం, మెడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డితో సహా దాని పరిసర జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఈదురు గాలులతో కూడిన గాలులు వీస్తాయని ఐఎమ్‌డి, హైదరాబాద్ తెలిపింది. తుపాను వ్యవస్థ బలహీనపడి అల్పపీడనంగా మారడంతో, బుధవారం నాటికి వర్షాలు క్రమంగా తగ్గుతాయి.

నవంబర్ 4వ తేదీన ఖమ్మం, సూర్యపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండలోనూ ఉరుములు, మెరుపులు, గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 80 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతాయి. మిగిలిన జిల్లాల్లోలోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నవంబర్ 5, 6వ తేదీ ఉదయం వరకు వానలు పడనున్నాయి.

భారతదేశం నామకరణం చేసిన ఈ మురసు తుపాను మరింత బలపడి అత్యంత తీవ్ర తుపానుగా మారనుంది. దీని అర్థం డ్రమ్. నవంబర్ 3 ఉదయానికి నెల్లూరు-నరసాపురం మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉంది. అప్పుడు గాలి వేగం గంటకు 100-110 కిలోమీటర్లుగా, గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More