...
...
Next Story

Telangana Weather : వినాయక చవితికి భారీ వర్షం.. తెలంగాణలో సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు వానలు!

Telangana Weather : తెలంగాణలో సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో కూడా ఉరుములతో కూడిన వర్షాలు పడనున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు.

Updated on: Sep 7, 2026, 21:14:59 IST
Advertisement

తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రోణి, బలహీనమైన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మారనుంది. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు, ఈదురుగాలులు వచ్చే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు.

తెలంగాణలో భారీ వర్షాలు
తెలంగాణలో భారీ వర్షాలు

ఈసారి సెప్టెంబర్ 14న నిర్వహించనున్న వినాయక చవితి పండుగకు వర్షం ఎక్కువగా కురిసే అవకాశం ఉంది. వాతావరణ విశ్లేషకుడు టి. బాలాజీ (Telangana Weatherman) అందించిన సమాచారం ప్రకారం, సెప్టెంబర్ 12 నుంచే రాష్ట్రంలో ఉరుములతో కూడిన వర్షాలు ప్రారంభమవుతాయి. పండుగ సమయానికి వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది.

గణేష్ మండపాలను ఏర్పాటు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రధాన ప్రాంతాల్లో చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు నమోదు కానున్నట్లు అంచనా వేశారు. ముఖ్యంగా రాజేంద్రనగర్, నానక్‌రామ్‌గూడ, మణికొండ, కొకపేట, మొయినాబాద్, చిల్కూరు, మంచిరేవుల, శంషాబాద్, కొల్లూర్, అజీజ్‌నగర్, ఇస్నాపూర్, పటాన్‌చెరు పరిసర ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు తెలంగాణ వెదర్ మ్యాన్.

ఇదిలా ఉండగా భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 4 నుంచి తెలంగాణలో వర్షాల తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం వల్ల ఏర్పడే ఎల్ నినో వాతావరణ మార్పుల ప్రభావం రాష్ట్రంపై పడటమే ఇందుకు ప్రధాన కారణమని అధికారులు వివరించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe