...
...
Next Story

శివారు ప్రాంతాల్లో కమ్మేసిన పొగ మంచు…! హైదరాబాద్‌ - బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌

హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో భారీగా పొగమంచు కమ్ముకుంది. ఈ తీవ్రత హైదరాబాద్‌- బెంగళూరు హైవేపై ఎక్కువగా ఉంటుంది. దట్టంగా పొగముంచు అలముకోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. నెమ్మదిగా వాహనాలు ముందుకు కదులుతున్నాయి.

Published on: Jan 2, 2026, 09:55:56 IST
Advertisement

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. రాజేంద్రనగర్, శంషాబాద్ ఎయిర్ పోర్టు, కిస్మత్ పూర్‌తో పాటు ఔటర్ రింగు రోడ్డులోని కొన్ని ప్రాంతాలు పొగమంచుతో కప్పినట్లుగా మారాయి. దీంతో హైదరాబాద్ - శంషాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దట్టమైన పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దట్టమైన పొగమంచు
దట్టమైన పొగమంచు

దట్టమైన పొగమంచు కారణంగా ప్రయాణికులు వాహనాలను రహదారి పక్కన నిలిపివేశారు. సుమారు 10 కిలోమీటర్ల వరకు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని వాహనాలు మాత్రం చాలా నెమ్మదిగా కదులుతున్న పరిస్థితులు ఉన్నాయి.

మరోవైపు హైదరాబాద్ - విజయవాడ హైవేపై కూడా ఇదే మాదిరి పరిస్థితులున్నాయి. పొగమంచు కారణంగా వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌ - ఘట్‌కేసర్‌ బైపాస్‌ మార్గంలోనూ దట్టమైన పొగమంచు అలుముకుంది.

ఇక శంషాబాద్ ఎయిర్ పోర్టులోనూ పొగమంచు కమ్మేసింది. దీంతో పలు విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇవాళ తెల్లవారుజాము నుంచి రన్‌వేపై విజిబిలిటీ ఏకంగా జీరోకి పడిపోవడంతో పలు విమానలు రద్దయ్యాయి. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఫలితంగా ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ కు రావాల్సిన పలు విమానాలు కూడా ఆలస్యంగా నడవనున్నాయి.

హైదరాబాద్ వాతావరణ కేంద్ర రిపోర్ట్ ప్రకారం.... ఆకాశం పాక్షికంగా మేఘావృతమైన ఉంటుంది. ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచుతో కూడిన పరిస్థితులుంటాయి. ఉపరితల గాలులు తూర్పు, ఆగ్నేయ దిశలో గంటకు 4 నుంచి 6 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks