మూడో విడత వేలంలో కోకాపేట భూముల నుంచి హెచ్ఎండీఏకు 1000 కోట్ల ఆదాయం!

కోకాపేట భూములు మరోసారి అందరి దృష్టిని ఆకర్శించాయి. మూడో విడత వేలంలో హెచ్‌ఎండీఏకు రూ.1000 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. అయితే ధరలు గత రికార్డులను మాత్రం తాకలేదు.

Published on: Dec 3, 2025, 20:17:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కోకాపేట నియోపొలిస్ భూముల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వేలం వేస్తే కోట్లలో పలుకుతుంది ధర. అందరి దృష్టి ఇక్కడి వేలంపైనే ఉంటుంది. నియోపొలిస్ భూములకు మూడో విడుత వేలం ప్రక్రియ ముగిసింది. ఇందులో మరోసారి హెచ్ఎండీఏకు భారీగా ఆదాయం సమకూరింది. ప్లాట్ నెంబర్ 19, 20లోని 8.04 ఎకరాలకు అధికారులు ఈ వేలం చేపట్టారు.

కోకాపేట భూముల వేలం
కోకాపేట భూముల వేలం

ప్లాట్ నెంబర్ 19లో ఎకరానికి రూ.131 కోట్లు పలకగా.. ప్లాట్ నెంబర్ 20లో ఎకరం రూ.118 కోట్ల ధర పలికింది. మూడో విడత వేలంలో 8.04 ఎకరాలకు 1000 కోట్ల వరకు హెచ్ఎండీఏకు ఆదాయం సమకూరింది. 44 ఎకరాల భూమిని నాలుగు విడతల్లో వేలం వేసేందుకు హెచ్ఎండీఏ ప్లాన్ చేసింది. ఇందులో తాజాగా మూడో విడత కూడా ముగిసింది. ఇప్పటి దాకా 27 ఎకరాలకు గానూ.. రూ.3708 కోట్ల ఆదాయం వచ్చింది. డిసెంబర్ 5వ తేదీన నాలుగో విడత వేలం కోకాపేట గోల్డెన్ మైల్‌లోని 2 ఎకరాలు, మూసాపేటలో 15 ఎకరాలకు జరగనుంది.

నియోపొలిస్ లేఅవుట్‌లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) నిర్వహించిన ఈ వేలం కిందటితో పోల్చుకుంటే కాస్త ధర తగ్గిందనే చెప్పాలి. గతంలో ఎకరం భూమికి రికార్డు స్థాయిలో రూ.150 కోట్లకుపైగా ధర పలికింది.

కోకాపేట్‌ నియోపొలిస్‌ రెండో విడత ఈ వేలంలో ఎకరం గరిష్టంగా రూ.151.25 కోట్ల ధర పలికిని విషయం తెలిసిందే. నియోపొలిస్‌లోని 15వ ప్లాట్‌లో ఉన్న 4.03 ఎకరాలకు, 16వ ప్లాట్‌లో ఉన్న 5.03 ఎకరాలకు బిడ్డింగ్ నిర్వహించారు. ఇందులో 15వ ప్లాట్‌లో ఎక్కువ ధర వచ్చింది. 16వ ప్లాట్‌లో గరిష్ఠంగా ఎకరాకు 147.75 కోట్లు లభించింది. డిసెంబర్ 5వ తేదీన నాలుగో విడత వేలంపై అందరి ఆసక్తి నెలకొంది.

హెచ్‌డీంఏ మెుత్తం ఈ వేలం నుంచి రూ.5000 కోట్లకు పైగా ఆదాయం రావాలని ఆశిస్తుంది. కోకాపేట నియోపొలిస్ ప్లాట్‌లకు రూ.99 కోట్లు, గోల్డెన్ మైల్‌కు రూ.70 కోట్లు, మూసాపేట ప్లాట్‌లకు రూ.75 కోట్లు కనీస ధరలను నిర్ధారించిన విషయం తెలిసిందే. కోకాపేట భూములకు గతంలోనే రెక్కలు వచ్చాయి. 2023లో కోకాపేటలో ఎకరం భూమి రూ.100.75 కోట్లకు అమ్ముడైంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More