హైదరాబాద్ నగరంలో రద్దీగా ఉండే ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ చిక్కులను అధిగమించేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(HMDA) మరొక కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(ICCC) నుంచి గచ్చిబౌలి సమీపంలోని శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ రోడ్డు వరకు 8.75 కిలోమీటర్ల నిడివితో భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి హెచ్‌ఎమ్‌డీఏ టెండర్లను ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 1,334.87 కోట్లుగా నిర్ణయించారు.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (EPC) టర్న్‌కీ పద్ధతిలో చేపట్టనున్నారు. ఇందులో భాగంగా సర్వే, సమగ్ర పరిశోధన, డిజైన్, కారిడార్ నిర్మాణంతో పాటు రహదారి వెడల్పు చేయడం, అవసరమైన చోట పునర్నిర్మాణ పనులను చేపడతారు. ఈ టెండర్‌లో నాలుగు లేన్ల, ఆరు లేన్ల ఎలివేటెడ్ విభాగాలు, ర్యాంపులు, కింది స్థాయిలో ఉండే రోడ్డు భాగాల కలయికకు అవకాశం ఉంది.
ఈ కారిడార్‌లో పలుచోట్ల ప్రవేశ, నిష్క్రమణ ర్యాంపుల ఏర్పాటుతో పాటు ఆరు-లేన్ల ఎలివేటెడ్ విభాగం ఉంటుంది. భవిష్యత్తులో వ్యూయింగ్ గ్యాలరీని అభివృద్ధి చేసేందుకు వీలుగా సుమారు 200 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు గల స్థలాన్ని కూడా కేటాయించారు.
వాహనాల రాకపోకలు సులభతరం చేసేందుకు ఆరు వరసల ఎలివేటెడ్ సెక్షన్‌తో పాటు పలు కీలక ప్రాంతాల్లో వాహనాలు ఎక్కేందుకు, దిగేందుకు వీలుగా ప్రవేశ, నిష్క్రమణ ర్యాంప్‌లను ఏర్పాటు చేస్తారు.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మైండ్ స్పేస్, ఐటీ కారిడార్ అయిన గచ్చిబౌలి ప్రాంతాల మధ్య నిత్యం లక్షలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. పీక్ అవర్స్‌లో ఈ మార్గాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతుంటాయి. ఈ కొత్త ఎలివేటెడ్ కారిడార్ అందుబాటులోకి వస్తే బంజారాహిల్స్ నుంచి ఐటీ హబ్ వైపు వెళ్లే ప్రయాణికులకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మౌలిక వసతుల విస్తరణకు ఇది మైలురాయిగా నిలవనుంది.
ఈ భారీ ప్రాజెక్టును వర్షాకాలం, విద్యుత్, నీటి సరఫరా వంటి కరెంట్, పైప్‌లైన్ యుటిలిటీల తరలింపు ప్రక్రియతో సహా మొత్తం 24 నెలల(రెండు సంవత్సరాల) వ్యవధిలో పూర్తి చేయాలని హెచ్‌ఎమ్‌డీఏ గడువు విధించింది.
{{/usCountry}}ఈ భారీ ప్రాజెక్టును వర్షాకాలం, విద్యుత్, నీటి సరఫరా వంటి కరెంట్, పైప్‌లైన్ యుటిలిటీల తరలింపు ప్రక్రియతో సహా మొత్తం 24 నెలల(రెండు సంవత్సరాల) వ్యవధిలో పూర్తి చేయాలని హెచ్‌ఎమ్‌డీఏ గడువు విధించింది.
{{/usCountry}}టెండర్ల ప్రక్రియకు సంబంధించి ముందస్తు అంచనాల సమీక్ష కోసం సెప్టెంబరు 22న హెచ్‌ఎమ్‌డీఏ చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించనున్నారు. ఆసక్తి కలిగిన కాంట్రాక్టర్లు తమ బిడ్లను దాఖలు చేయడానికి అక్టోబరు 5ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. టెండర్ల ప్రక్రియ పూర్తి కాగానే పనులను వేగవంతం చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.