వచ్చే వేసవిలో నీటి ఇబ్బందులు లేకుండా జలమండలి అడ్వాన్స్ యాక్షన్ ప్లాన్!
హైదరాబాద్ ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడకుండా జలమండలి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వచ్చే వేసవిలో తాగునీటికి డోకా లేకుండా అడ్వాన్స్ యాక్షన్ ప్లాన్ మెుదలుపెట్టింది.
రాబోయే వేసవి కాలంలో హైదరాబాద్ మహానగరంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWS&SB) మేనేజింగ్ డైరెక్టర్ కె. అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ వాటర్ బోర్డు
ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్‌తో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో వేసవి కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. సింగూర్-మంజీరా ప్రత్యామ్నాయ ప్రణాళికలు, విద్యుత్ బోర్‌వెళ్ల పునరుద్ధరణ, వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ల సామర్థ్యం, పారిశ్రామిక, బల్క్ నీటి సరఫరా, నెట్‌వర్క్ అనుసంధానత, శుద్ధి చేసిన నీటి మళ్లీ వినియోగం వంటి కీలక అంశాలను సమీక్షించారు.
{{^htLoading}} {{/htLoading}}
సింగూర్, మంజీరా జలాలపై ఆధారపడే ప్రాంతాలను గుర్తించి, అత్యవసర సమయాల్లో ఇతర వనరుల నుంచి ప్రత్యామ్నాయంగా నీటిని సరఫరా చేసేందుకు రూట్, నీటి పరిమాణంతో కూడిన ముందస్తు ప్లాన్ సిద్ధం చేయాలని ఎండీ ఆదేశించారు.
ప్రత్యామ్నాయ నీటి సరఫరాకు అవసరమైన ఇంటర్‌కనెక్షన్లు, జంక్షన్లు, వాల్వ్‌లు, లైన్లను ముందే తనిఖీ చేసి సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
వేసవిలో అధిక డిమాండ్ ఉండి, తక్కువ పీడనంతో నీరు సరఫరా అయ్యే ప్రాంతాలను, అలాగే పైప్‌లైన్ నెట్‌వర్క్ చివరన ఉన్న ప్రాంతాలను గుర్తించి.. అక్కడ కొత్త పైప్‌లైన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
వేసవిలో నీటి వృథాను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, తాగునీటిని గృహేతర అవసరాలకు ఉపయోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తొలుత అవగాహన కల్పించి, ఆ తర్వాత కూడా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఫిల్లింగ్ స్టేషన్ల సామర్థ్యం, రోజువారీ ట్యాంకర్ల సరఫరా, డిమాండ్‌ను అంచనా వేసి.. అదనంగా ఫిల్లింగ్ పాయింట్లు అవసరమైన ప్రాంతాలను గుర్తించాలని ఆదేశించారు. వేసవిలో నగరవాసులకు ఎలాంటి నీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు జలమండలి ముందస్తు చర్యలు చేపడుతోంది.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.