...
...
Next Story

Hyderabad : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నల్లాకు మోటర్ బిగిస్తే భారీగా జరిమానా

Hyderabad : హైదరాబాద్‌లో నల్లాలకు మోటర్లు బిగిస్తే భారీగా జరిమానా విధిస్తామని జలమండలి హెచ్చరిస్తోంది. పదే పదే ఇలాంటి పనులు చేస్తే పోలీస్ చర్య కూడా ఉంటుందని తెలిపింది.

Published on: Apr 07, 2026 09:28 AM IST
Advertisement

ఓ వైపు వేసవి మెుదలైంది. కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత మెుదలైంది. ట్యాంకర్ల కూడా భారీగా డిమాండ్ ఉంది. జలమండలి కూడా ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి.. దూర ప్రాంతాల నుంచి నీటిని శుద్ధి చేసి హైదరాబాద్ వాసులకు అందిస్తోంది. కొందరు మాత్రం నల్లాకు మోటర్లు బిగించి.. మిగతావారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అలా నీటి కుళాయిలకు అక్రమంగా మోటార్లు అమర్చుకునే వినియోగదారులపై HMWSSB రూ.5,000 జరిమానా విధించనుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

తమకు నీటి సరఫరాను పెంచుకోవడానికి కుళాయి కనెక్షన్లపై మోటార్లను అక్రమంగా ఉపయోగించే వినియోగదారులపై చర్యలు తీసుకుంటామని జలమండలి హెచ్చరించింది. వారికి రూ. 5,000 జరిమానా విధిస్తామని హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్&ఎస్‌బీ (HMWS&SB) తెలిపింది. పదేపదే ఈ నిబంధనను ఉల్లంఘించే వారిపై పోలీసు చర్య కూడా తీసుకోవచ్చు.

'కొన్ని ప్రాంతాల నుంచి లో వాటర్ ప్రెజర్‌కు సంబంధించి మాకు ఫిర్యాదులు అందాయి. అక్రమ మోటార్లే దీనికి కారణమని మా ప్రాథమిక విచారణలో తేలింది. కాలనీలకు నీటి సరఫరా జరిగే సమయంలో మేం ఆయా ప్రాంతాలను సందర్శిస్తాం.' అని హైదరాబాద్ వాటర్ బోర్డు చెబుతోంది.

కొన్ని ప్రాంతాల్లో ఆటోమేటిక్, హై-స్పీడ్ మోటార్లను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల నీటి సరఫరా లైన్ల చివరన ఉన్న వారి ప్రాంతంలోని ఇతర కుటుంబాలకు తగినంత తాగునీరు అందడం లేదని హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్ చెబుతోంది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లను కవర్ చేసే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(CURE) ప్రాంతంలో బృందాలను ఏర్పాటు చేశారు.

మెట్రో కస్టమర్ కేర్ నంబర్ 155313, HMWSSB వినియోగదారుల సేవల మొబైల్ యాప్‌కు అందిన ఫిర్యాదుల ఆధారంగా కొన్ని ప్రాంతాలను ఎంపిక చేశారు అధికారులు. ఇంటింటికీ తనిఖీలు నిర్వహించనున్నారు. నల్లాకు మోటర్లు బిగించినవారిపై చర్యలు తీసుకుంటారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe