...
...
Next Story

ఘోరమైన ఘటన.. బాలుడి కనుగుడ్డు పీకేసిన వీధి కుక్కలు

తెలంగాణలో వీధి కుక్కల దాడులు భయాందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఓ బాలుడి కనుగుడ్డును వీధికుక్కలు పీకేశాయి.

Published on: Mar 27, 2026, 11:43:48 IST
Advertisement

భువనగిరిలో ఘోరమైన ఘటన జరిగింది. వీధి కుక్కలు మరోసారి బీభత్సం సృష్టించాయి. వేర్వేరు ఘటనల్లో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. భువనగిరిలోని తారకరామ్‌నగర్‌లో ప్రియాన్ష్ అనే నాలుగేళ్ల బాలుడు ఇంటి బయట ఆడుకుంటుండగా వీధి కుక్కలు అతడిపై దాడిచేశాయి.

వీధి కుక్కలు
వీధి కుక్కలు

భువనగిరిలో తారకరామ్‌నగర్‌కు చెందిన సందెల రాహుల్‌కుమార్, శ్రావణి దంపతుల కుమారుడు ప్రియాన్ష్ ఇంటి బయట ఆడుకుంటున్నాడు. రెండు కుక్కలు అతడి మీద దాడి చేశాయి. ఒక కుక్క ముఖంపై తీవ్రంగా కరిచి బాలుడి కనుగుడ్డును పీకేసింది. బాలుడు కేకలు వేయగా.. కుటుంబ సభ్యులు, కాలనీవాసులు బయటకు వచ్చి చూశారు. అప్పటికే బాలుడి కనుగుడ్డు నేలపై పడింది. దీంతో స్థానికంగా భయాందోళన నెలకొన్నది. వెంటనే కుక్కను తరిమికొట్టి బాలుడిని ఆసుపత్రికి తరలించారు. మెరుగైవ వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లారు.

మరోవైపు ఆర్‌బీ నగర్‌లో జరిగిన ఇలాంటి మరో ఘటనలో అగర్వాల్, తన్విష్ అనే ఆరేళ్ల ఇద్దరు పిల్లలు నడుస్తుండగా వారిని వెంబడించి, వారి కాళ్లపై కుక్కలు కరిచాయి. పిల్లలను మొదట స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.

పెరుగుతున్న వీధి కుక్కల బెడదపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, తక్షణ నివారణ చర్యలు తీసుకోవాలని పురపాలక అధికారులను కోరారు.

1,000 వీధి కుక్కల హత్యపై ఫిర్యాదు

నిజామాబాద్‌లో గత ఏడు నెలలుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 1,000 వీధి కుక్కలను చంపారని ఆరోపిస్తూ, పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (PETA) నిజామాబాద్ నార్త్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆ సంస్థ వీడియోలతో సహా అందుబాటులో ఉన్న సాక్ష్యాలను సమర్పించగా, పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో 10 సాక్ష్యాలు ఉన్నాయని, దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని నిజామాబాద్ నార్త్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సతీష్ కుమార్ తెలిపారు.

కరీంనగర్ జిల్లాకు చెందిన పీటా ప్రతినిధి గౌతమ్ మాట్లాడుతూ... గుర్తు తెలియని వ్యక్తులు పట్టణంలో తిరుగుతూ కుక్కలను చంపుతున్నారని ఆరోపించారు. ఆగస్టులో ఒక పెంపుడు కుక్కను కూడా చంపారని తెలిపారు. తగినన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే ఫిర్యాదు నమోదు చేశామని పేర్కొన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks