...
...
Next Story

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు వ్యవసాయ కూలీలు మృతి

Sangareddy Road Accident : సంగారెడ్డి జిల్లా పరిధిలో మంగళవారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగాయి. ఓ ప్రమాదంలో ఏడుగురు మరణించగా, మరో ప్రమాదంలో ఇద్దరు మరణించారు.

Published on: Aug 11, 2026, 21:39:53 IST
Advertisement

సంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. జహీరాబాద్, కోహీర్ మండలాల్లో చోటుచేసుకున్న ఈ ప్రమాదాల్లో మొత్తం 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

సంగారెడ్డి రోడ్డు ప్రమాదం
సంగారెడ్డి రోడ్డు ప్రమాదం

జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై అతివేగంతో వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో నుజ్జునుజ్జయి, అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు కూలీలు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. ప్రమాద తీవ్రతకు తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురిని పోలీసులు వెంటనే స్థానికుల సహాయంతో జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మృతులు, క్షతగాత్రులంతా పొలం పనుల నిమిత్తం సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకలోని బీదర్ జిల్లా రాజగిరి గ్రామం నుంచి వచ్చిన వ్యవసాయ కూలీలుగా పోలీసులు ధ్రువీకరించారు. పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రానికి వచ్చి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.

కోహీర్ వద్ద కారు బీభత్సం

సంగారెడ్డి జిల్లా పరిధిలోని కోహీర్ మండలం వెంకటాపూర్ క్రాస్ రోడ్ సమీపంలో 65వ నంబరు జాతీయ రహదారిపై మరో భయానక ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా ప్రయాణిస్తున్న ఒక కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను దాటుకుని అవతలి వైపునకు ఎగిరిపడింది. ఈ ఊహించని పరిణామంలో రహదారిపై ఎదురుగా వస్తున్న నాలుగు వాహనాలు ఒకదానికొకటి ఢీకొని తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలు వాహనాల్లో ఉన్న ప్రయాణికులకు గాయాలయ్యాయి.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రహదారి భద్రతా సిబ్బంది సంఘటనా స్థలాలకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దెబ్బతిన్న వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించి, నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అతివేగం అజాగ్రత్తే ఈ ఘోర ప్రమాదాలకు ప్రధాన కారణాలని ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు ఘటనలపై వేర్వేరుగా కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks