Ice Cream Storage : ఐస్‌క్రీమ్ ఫ్రీజర్‌లో ఎన్ని రోజులు తాజాగా ఉంటుంది...? ఈ తప్పులు అస్సలు చేయకండి!

Ice Cream Storage Tips : వేసవి కాలంలో ఐస్‌క్రీమ్‌ను ఇంట్లో నిల్వ ఉంచే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే ఫ్రీజర్‌లో ఐస్‌క్రీమ్ ఎన్ని రోజులు సురక్షితంగా ఉంటుంది, దానిని ఎలా నిల్వ చేయాలో తెలియకపోతే ఆరోగ్యానికి ముప్పు తప్పదు.

Published on: May 29, 2026, 18:21:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ice Cream Storage Tips : ఎండలు మండిపోయే వేసవి కాలంలో చల్లచల్లని ఐస్‌క్రీమ్ తినడానికి చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. చాలా మంది ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఐస్‌క్రీమ్ డబ్బాలను లేదా ప్యాకెట్లను కొనుగోలు చేసి ఫ్రీజర్‌లో దాచి పెట్టుకుంటారు. కావలసినప్పుడు బయటకు తీసి తింటూ ఉంటారు. అయితే, ఇలా ఫ్రీజర్‌లో ఉంచే ఐస్‌క్రీమ్ ఎంతకాలం పాటు సురక్షితంగా…. తాజాదనం కోల్పోకుండా ఉంటుందనే విషయంపై చాలా తక్కువ మందికి మాత్రమే అవగాహన ఉంది.

ఐస్‌క్రీమ్ ఫ్రీజర్‌లో పెడితే ఎన్నాళ్లు తాజాగా ఉంటుంది? ఈ తప్పులు అస్సలు చేయకండి!
ఐస్‌క్రీమ్ ఫ్రీజర్‌లో పెడితే ఎన్నాళ్లు తాజాగా ఉంటుంది? ఈ తప్పులు అస్సలు చేయకండి!

ఐస్‌క్రీమ్‌ను సరైన ఉష్ణోగ్రత వద్ద సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే దాని అసలు రుచి మారిపోవడమే కాకుండా, క్రీము ఆకృతి కూడా పూర్తిగా దెబ్బతింటుంది. ఒక్కోసారి ఐస్‌క్రీమ్ పైన మంచు గడ్డలు పేరుకుపోవడం లేదా ఫ్రీజర్ నుంచి వచ్చే వింత వాసనను అది లాగేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకసారి మూత తీసిన లేదా ఒలిచిన ఐస్‌క్రీమ్ చాలా వేగంగా పాడైపోయే ప్రమాదం ఉంది. అందుకే ఐస్‌క్రీమ్‌ను ఎంతకాలం నిల్వ ఉంచాలి, ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడం ఎంతో అవసరం.

ఎంతకాలం సురక్షితం….?

  • కంపెనీ ప్యాకింగ్ తెరవని ఐస్‌క్రీమ్ : మార్కెట్ నుంచి తెచ్చిన ఐస్‌క్రీమ్ ప్యాకెట్ లేదా డబ్బా మూత తెరవకుండా (Closed Packaged) ఉంటే… దానిని ఫ్రీజర్‌లో సాధారణంగా ఒకటి నుండి రెండు నెలల పాటు సురక్షితంగా ఉంచవచ్చు. కొనేముందు ప్యాకెట్ వెనుక రాసి ఉండే 'ఎక్స్‌పైరీ డేట్' లేదా 'బెస్ట్ బిఫోర్' తేదీని తప్పనిసరిగా గమనించాలి.
  • ఒకసారి తెరిచిన ఐస్‌క్రీమ్ : ఐస్‌క్రీమ్ ప్యాకెట్ లేదా బాక్స్ మూత ఒకసారి తెరిచిన తర్వాత దానిని ఏడు నుంచి పది రోజులలోపు తినేయడం అత్యంత ఉత్తమం. అప్పుడే దాని అసలు రుచి, క్రీము ఆకృతి మరియు తాజాదనం చక్కగా మెయింటైన్ అవుతాయి.

ఉష్ణోగ్రత ఎందుకు ముఖ్యం?

ఐస్‌క్రీమ్‌ను ఎల్లప్పుడూ అత్యంత చల్లని, స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఉంచాలి. తక్కువ ఉష్ణోగ్రత వల్ల బ్యాక్టీరియా చేరే అవకాశం తగ్గి, ఐస్‌క్రీమ్ చెడిపోకుండా ఉంటుంది. అలాగే దాని క్రీము లాంటి సాఫ్ట్ ఆకృతి దెబ్బతినకుండా ఉంటుంది.

  • రుచి మారడం : ఐస్‌క్రీమ్‌ను పరిమితికి మించి ఎక్కువ కాలం ఫ్రీజర్‌లో ఉంచితే దాని సహజమైన రుచి తగ్గిపోతుంది.
  • మంచు గడ్డలు కట్టడం : ఫ్రీజర్ నుండి ఐస్‌క్రీమ్‌ను పదే పదే బయటకు తీసి, మళ్లీ లోపల పెట్టడం వల్ల గాలి తగిలి అందులో చిన్న చిన్న మంచు స్పటికాలు (Ice Crystals) లేదా గడ్డలు ఏర్పడతాయి.
  • దుర్వాసన రావడం : చాలా రోజులు ఫ్రీజర్‌లోనే ఉండిపోతే, ఫ్రీజర్‌లోని ఇతర ఆహార పదార్థాల వాసనను లేదా ఫ్రీజర్ వాసనను ఐస్‌క్రీమ్ పీల్చుకుంటుంది. దీనివల్ల దాని రుచి పూర్తిగా పాడైపోతుంది.

ఐస్‌క్రీమ్‌ను సరిగ్గా నిల్వ చేసే పద్ధతులు:

  • బాగా మూసి ఉంచాలి: ఒకసారి వాడిన ఐస్‌క్రీమ్ డబ్బాను తిరిగి ఫ్రీజర్‌లో పెట్టేటప్పుడు గాలి చొరబడకుండా గట్టిగా మూత పెట్టాలి.
  • పదే పదే బయటకు తీయవద్దు : ఐస్‌క్రీమ్ డబ్బాను తరచుగా బయటకు తీసి ఎక్కువ సమయం బయట ఉంచకూడదు. దీనివల్ల ఉష్ణోగ్రత మారిపోయి ఐస్‌క్రీమ్ త్వరగా పాడవుతుంది.
  • బట్టర్ పేపర్ ఉపయోగించండి : ఐస్‌క్రీమ్ డబ్బా మూత పెట్టే ముందు, ఐస్‌క్రీమ్ ఉపరితలానికి తాకేలా ఒక వెన్న కాగితం లేదా క్లీన్ ప్లాస్టిక్ పొరను ఉంచాలి. ఇది గాలి ప్రభావాన్ని తగ్గించి మంచు గడ్డలు కట్టకుండా చూస్తుంది.
  • ఫ్రీజర్ తలుపులు తరచుగా తీయవద్దు : ఫ్రీజర్ డోర్‌ను పదే పదే తెరవడం వల్ల లోపలి చల్లదనం తగ్గి ఉష్ణోగ్రత మారుతుంది. ఇది ఐస్‌క్రీమ్ నాణ్యతను దెబ్బతీస్తుంది.

పాడైపోయిన ఐస్‌క్రీమ్‌ను గుర్తించడం ఎలా?

ఐస్‌క్రీమ్ చెడిపోయిందని చెప్పడానికి కొన్ని స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. దాని రుచి వింతగా లేదా పుల్లగా అనిపించడం, క్రీములా ఉండాల్సిన ఆకృతి కాస్త గరుకుగామారడం వంటివి కనిపిస్తాయి. దానిపై విపరీతంగా మంచు గడ్డలు పేరుకుపోవడం మరియు వింత వాసన రావడం వంటివి జరిగితే ఆ ఐస్‌క్రీమ్ పాడైపోయిందని గ్రహించాలి. దానిని తినకపోవడమే ఆరోగ్యానికి మంచిది.

చాలా మంది చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే.. ఫ్రీజర్ నుండి తీసిన ఐస్‌క్రీమ్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత…. దానిని మళ్లీ గడ్డకట్టడం కోసం (Re-freeze) అలాగే ఫ్రీజర్‌లో పెడుతుంటారు. కరిగిన ఐస్‌క్రీమ్‌ను మళ్లీ ఫ్రీజ్ చేయడం వల్ల అందులో హానికరమైన బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. ఇది తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి కరిగిన ఐస్‌క్రీమ్‌ను మళ్లీ ఫ్రీజ్ చేయకుండా వెంటనే తినేయాలి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More