...
...
Next Story

TG Cheyutha Pension Status : మీకు పెన్షన్ మంజూరు అయిందా..? మీ ఆధార్ నెంబర్ తో అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

Telangana Cheyutha Pension Status : తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 4,63,857 మందికి చేయూత పింఛన్లు మంజూరు చేసింది. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది. ఇందుకు సంబంధించిన స్టేటస్ తో పాటు ఇతర వివరాలను ఇలా చెక్ చేసుకోవచ్చు.

Published on: Nov 16, 2026, 12:30:26 IST
Advertisement

Telangana Cheyutha Pension Status : తెలంగాణలోని పేదలు, మహిళలు, దివ్యాంగులు, వృత్తి కార్మికులకు శుభవార్త వచ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4,63,857 మందికి చేయూత పింఛన్లను మంజూరు చేసింది. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 19వ తేదీన కొత్త లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి పింఛన్ నగదును జమ చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.

విభాగాల వారీగా వివరాలు….

చేయూత పెన్షన్లు
చేయూత పెన్షన్లు

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మంజూరు చేసిన మొత్తం 4,63,857 పింఛన్లలో వివిధ వర్గాల వారికి చోటు కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించాలనే ఉద్దేశంతో ఈ జాబితాను ఖరారు చేశారు. విభాగాల వారీగా లబ్ధిదారుల సంఖ్య కింది విధంగా ఉంది.

  • వితంతువులు : 2,77,894 మంది
  • దివ్యాంగులు : 1,00,224 మంది
  • ఒంటరి మహిళలు : 53,844 మంది
  • గీత కార్మికులు : 27,444 మంది
  • చేనేత కార్మికులు : 4,451 మంది

పెన్షన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?

మొన్నటి వరకు తెలంగాణ చేయూత పెన్షన్ల అధికారిక పోర్టల్‌లో దరఖాస్తుదారుల స్టేటస్ పరిశీలిస్తే 'Applied For Pension' అని కనిపించేది. అయితే తాజాగా ఈ స్టేటస్‌లో మార్పులు గమనించవచ్చు. కొందరికి అప్రూవ్ అని వస్తే… ఆన్‌లైన్‌లో మరికొంత మందికి 'Withheld' అని చూపిస్తోంది. ఇలా కనిపిస్తే టెన్షన్ పడాల్సిన పని లేదు. వీరికి కూడా పెన్షన్ దాదాపుగా మంజూరు అయినట్లే. అయితే వీరి సదరు పంచాయతీ కార్యదర్శిని కలిసి ఏమైనా పత్రాలు అవసరం ఉంటే ఇవ్వాల్సి ఉంటుంది.

ఇక ఆన్లైన్ స్టేటస్ పేజీలో మీకు మంజూరైన పెన్షన్ మొత్తం వివరాలు కనిపించడంతో పాటు, కొత్తగా పెన్షన్ ఐడీ కూడా జనరేట్ అయి ఉంటుంది. ఈ ఐడీ నంబర్ మీ జిల్లా కోడ్‌తో మొదలవుతుంది. ఈ పెన్షన్ ఐడీతో కూడా మీ పెన్షన్ మంజూరు స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నూతన లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ ప్రారంభమైంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పత్రాలు అందజేస్తున్నారు. ఈనెల 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది.

ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యక్రమంలో మంజూరు పత్రాన్ని పొందే వీలు కుదరకపోతే….. గ్రామీణ ప్రాంతాల వారు ముందుగా తమ గ్రామ పంచాయతీ సెక్రటరీని కలవాలి. అక్కడ ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేసి మీ పెన్షన్ మంజూరు పత్రాన్ని తీసుకోవచ్చు. దీనివల్ల వచ్చే నెల నుంచి క్రమం తప్పకుండా మీ బ్యాంకు ఖాతాలోకి డబ్బులు జమ అవుతాయి.

  • ఒకవేళ పెన్షన్ మంజూరులో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఉన్నా, పూర్తి వివరాల కోసమైనా మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయ లోని సెర్ప్ (SERP) అధికారులను సంప్రదించవచ్చు.
  • పట్టణ ప్రాంతాల్లో నివసించే దరఖాస్తుదారులు తమ పరిధిలోని మున్సిపల్ కార్యాలయంలోని సంబంధిత అధికారులను కలవాలి.
  • అధికారులు తమ అధికారిక లాగిన్ నుంచి మీ కొత్త పెన్షన్ ఐడీని ఎంటర్ చేసి…. ఏ కారణాలతో పెన్షన్ తాత్కాలికంగా నిలిపివేశారో స్పష్టంగా తెలియజేస్తారు. తగిన పత్రాలు సమర్పిస్తే వెంటనే క్లియర్ చేస్తారు.

ఈ డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేసి చేయూత పెన్షన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks