సముద్రపు నాచుతో ఉత్పత్తుల తయారీ.. సెర్ప్, మెప్మా పలు కీలక ఒప్పందాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో పట్టణ ప్రాంతాల పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా), గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రూ.10,100 కోట్ల మెగా చెక్కును స్వయం సహాయక సంఘాలకు అందించారు సీఎం.
ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు సంస్థలతో స్వయం సహాయక సంఘాల కోసం సెర్ప్, మెప్మా ఒప్పందాలు జరిగాయి. సముద్రపు నాచుతో ఉత్పత్తుల తయారీకి 500 మంది మహిళలకు శిక్షణ ఇచ్చేలా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీతో ఒప్పందం చేసుకుంది. మహిళల అభివృద్ధికి వివిధ సంస్థలతో డ్వాక్రా, మెప్మా సెర్ప్ విభాగాలు కుదుర్చుకున్న 26 ఎంఓయూలు, మెప్మా కుదుర్చుకున్న 12 ఎంఓయూలను వర్చువల్‌గా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.

కీలక ఒప్పందాలు
- సీవీడ్ కల్చర్‌లో మహిళలకు శిక్షణ, ఉత్పత్తుల తయారీ కోసం సీఎస్ఐఆర్‌తోనూ కీలక ఒప్పందం
- స్వయం సహాయ సంఘాల మహిళలు ఈ సీవీడ్‌లను వివిధ రకాల ఉత్పత్తుల తయారీ కోసం కేరళకు చెందిన అమృత విశ్వవిద్యా పీఠంతో ఒప్పందం
- మహిళలకు నైపుణ్యాభివృద్ధి కల్పనపై ఎక్స్‌ఎల్ఆర్ఐ సంస్థతో ఒప్పందం చేసుకున్న మహిళా సంఘాలు
- పొదుపు చేసిన మొత్తాలతో వ్యాపారాలను నెలకొల్పేందుకు అవసరమైన సహకారం కోసం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో సెర్ప్ ఒప్పందం
- చేనేత, ఇతర ఫ్యాబ్రిక్ ఉత్పత్తుల మార్కెటింగ్ సహా ఇతర అంశాల్లో తోడ్పాటు కోసం ఆప్కోతో ఒప్పందం
- డిజిటల్ కామర్స్ సహా ఎఫ్పీఓ ఉత్పత్తుల మార్కెటింగ్ సహా వివిధ అంశాలపై సహకారం కోసం ఐఐఎం విశాఖపట్నంతో ఒప్పందం
అమరావతి పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదుగురు ఉత్తమ ఎంట్రపెన్యూర్‌లకు వేదికపై సన్మానం చేసి అభినందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రూ.10,100 కోట్ల మెగా చెక్కును స్వయం సహాయక సంఘాలకు అందించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు.
సెర్ప్, డ్వాక్రా సంఘాల్లోని సభ్యులకు ప్రభుత్వం ఇచ్చిన రుణాలతో ఎంట్రపెన్యూర్‌లుగా ఎదిగిన మహిళల ఆడియో-వీడియో ప్రదర్శన జరిగింది. 6,81,506 మంది మహిళలకు వివిధ విభాగాల నుంచి సబ్సిడీతో అందించే రుణాలను అందించారు ముఖ్యమంత్రి. లబ్ధిదారులకు వేదికపై మెగా చెక్‌ను పంపిణీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. లక్ష మంది మహిళలను పారిశ్రామిక వేత్తలను చేస్తామని చెప్పామని, 1,12,686 మంది మహిళలు ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేశారన్నారు. పట్టణ ప్రాంతాల్లో 33,899 మంది ఏర్పాటు చేశారని తెలిపారు. 84.66 లక్షల మంది డ్వాక్రాలో సభ్యులుగా ఉన్నారని, 8.34 లక్షల సంఘాలు ఉన్నాయన్నారు.
'ఇంటికో పారిశ్రామిక వేత్తను తయారు చేయాలని సంకల్పించాం. మంచి పనికి సంకల్పం తీసుకుంటే సాధించేవరకు పని చేసేది తెలుగింటి ఆడబిడ్డలే. రూ.21 వేల కోట్లు కార్పస్ ఫండ్ కింద మీ వద్ద ఉంది. మెప్మా సంఘాలు ఉన్నాయి.. వారినీ అభివృద్ధి చేస్తున్నాం. కొత్త బ్రాండ్ ఇప్పుడే ప్రారంభించాం... స్వయం మీ బ్రాండ్. అందులో మీ ఫోటోనే ఉంటుంది. 1.10 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. డ్వాక్రా సభ్యులు తయారు చేసే ఉత్పత్తులను మహిళలే వినియోగించుకోవాలి. దీని ద్వారా 3.30 కోట్ల మంది వినియోగించుకుంటారు.' అని చంద్రబాబు అన్నారు.
డ్వాక్రా మహిళల స్వయం బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి తాను ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. 37 ఎంఓయూలు ఈ రోజు చేసుకున్నామన్నారు. మార్కెట్లు, క్వాలిటీ పెంచడానికి, టెక్నాలజీ వినియోగానికి ఎంఓయూలు చేసుకున్నామని తెలిపారు.
ఈ రోజు నుంచి వచ్చే ఏడాదికి 5 లక్షల మంది మహిళలను పారిశ్రామిక వేత్తలను తయారు చేస్తామని చంద్రబాబు మాట ఇచ్చారు. గత ఏడాది 1 లక్ష మంది మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేశామని పేర్కొన్నారు. దేశంలో 6 లక్షల మంది ఆడబిడ్డలు పారిశ్రామిక వేత్తలు ఉండే ఏకైక రాష్ట్రం ఏపీ అన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


