తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఓటర్ దరఖాస్తుల ప్రక్రియ ముగింపునకు చేరుకోగా… తాజాగానే మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్, వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల యంత్రాంగం విడుదల చేసింది. ఈ మేరకు ఓటర్ల డ్రాఫ్ట్ లిస్టును అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

రెండు స్థానాల్లో కలిపి మొత్తం 11,89,191 మంది పట్టభద్రులు ఓటు హక్కుకు అర్హత సాధించినట్లు ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ పేరు జాబితాలో ఉందో లేదో ఇప్పుడే తనిఖీ చేసుకోవచ్చు.
మీరు పేరు ఇలా చెక్ చేసుకోండి
పట్టభద్రులు తమ ఓటు వివరాలను పరిశీలించుకునేందుకు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ప్రత్యేక సదుపాయం కల్పించింది. చాలా సులంభంగా మీ వివరాలు ఉన్నాయో లేవో తెలుసుకోవచ్చు…
- ముందుగా https://ceotelangana.nic.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
- హోమ్‌పేజీలో 'సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్టోరల్ రోల్స్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అక్కడ మీకు మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. ఎపిక్ నంబర్, అప్లికేషన్ ఐడీ లేదా ఓటర్ ప్రాథమిక వివరాలతో సెర్చ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
- మీ వద్ద ఉన్న వివరాల ఆధారంగా ఏదో ఒక ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఉదాహరణకు అప్లికేషన్ ఐడీతో సెర్చ్ చేయాలనుకుంటే, దరఖాస్తు ఐడీతో పాటు క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి.
- సబ్మిట్ బటన్ నొక్కగానే మీ వివరాలు తెరపై కనిపిస్తాయి. అందులో ఓటరు పేరు, అప్లికేషన్ నంబర్, పోలింగ్ స్టేషన్ తదితర వివరాలు ఉంటాయి. మీ పోలింగ్ స్టేషన్ వివరాలు కనిపిస్తే మీ ఓటు కన్ఫర్మ్ అయినట్లే.
ముసాయిదా జాబితాలో ఏవైనా పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు ఎన్నికల అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. ముసాయిదా జాబితాలో పేరు లేని వారు ఫారం-18 ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు.
{{/usCountry}}ముసాయిదా జాబితాలో ఏవైనా పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు ఎన్నికల అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. ముసాయిదా జాబితాలో పేరు లేని వారు ఫారం-18 ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు.
{{/usCountry}}ఇక పేరు, ఇంటిపేరు, చిరునామా లేదా ఫొటోలో తప్పులు ఉంటే సవరించుకోవటానికి ఫారం-8ను సమర్పించాలి. అందిన అభ్యంతరాలు, సవరణ వినతులను డిసెంబర్ 25లోగా అధికారులు పరిష్కరిస్తారు. ఆ తర్వాత….. డిసెంబర్ 30వ తేదీన తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. వచ్చే ఏడాదిలో ఇందుకు సంబంధించిన ఎన్నికలు జరుగుతాయి.
ఈ లింక్ పై క్లిక్ చేసి అభ్యంతరాలను పంపొచ్చు
ABOUT THE AUTHOR
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.