...
...
Next Story

Ration Card Download : రేషన్ కార్డు డిజిటల్ కాపీని ఫోన్‌లో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

Ration Card Download : కొన్నిసార్లు మీరు రేషన్ కార్డును వెంట తీసుకెళ్లరు. కానీ రేషన్ కార్డు నెంబర్ మాత్రం మీతో ఉంటుంది. ఇలాంటి సమయంలో మీ స్మార్ట్‌ఫోన్ నుండి డిజిటల్ రేషన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇ-రేషన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకునే సులభమైన విధానం, దాని ఉపయోగం తెలుసుకుందాం.

Updated on: Aug 5, 2026, 17:25:49 IST
Advertisement

చాలామంది తరుచూ తమ రేషన్ కార్డులను పోగొట్టుకోవడం లేదా పాడుచేసుకోవడం వల్ల ఇబ్బంది పడుతుంటారు. ఒకవేళ మీరు మీ రేషన్ కార్డును పోగొట్టుకున్నట్లయితే.. కేవలం మీ దగ్గర నెంబర్ ఉంటే వెంటనే డిజిటల్ కాపీని మీ స్మార్ట్‌ఫోన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిజిటల్ రేషన్ కార్డును ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చో చూడండి.

రేషన్ కార్డు డౌన్‌లోడ్
రేషన్ కార్డు డౌన్‌లోడ్

ప్రభుత్వం అందిస్తున్న ఈ డిజిటల్ సేవతో, మీ రేషన్ కార్డు ఇ-కాపీని పొందడం గతంలో కంటే చాలా సులభం, వేగవంతం అయింది. ఈ డిజిటల్ కాపీని మీరు అవసరం ఉన్న దగ్గర చూపించవచ్చు. అవసరమైతే రేషన్ షాపులో రేషన్ పొందడానికి దీనిని ఉపయోగించవచ్చు. ఆ సులభమైన పద్ధతి ఎలాగో చూడండి.

మేరా రేషన్ యాప్

గూగుల్ ప్లే స్టోర్ నుండి మేరా రేషన్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.

మీకు నచ్చిన భాషను ఎంచుకుని, ఆధార్ నంబర్, ఓటీపీ ఉపయోగించి లాగిన్ అవ్వండి.

మీ రేషన్ కార్డును రక్షించుకోవడానికి, దానిలో MPINను కూడా సెట్ చేసుకోవచ్చు.

లాగిన్ అయిన తర్వాత, మీకు రేషన్ కార్డు సమాచారం కనిపిస్తుంది.

పైననే కనిపించే డౌన్‌లోడ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి, పీడీఎఫ్ ఫైల్‌ను మీ మొబైల్‌లో సేవ్ చేసుకోండి.

స్టేట్ పోర్టల్‌లోనూ డౌన్‌లోడ్ చేయవచ్చు

మీ రాష్ట్ర ఆహార, సరఫరాల శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

రేషన్ కార్డు డౌన్లోడ్ లింక్‌పై క్లిక్ చేయండి.

ఉదాహరణకు ఈ లింక్ మీద క్లిక్ చేయండి.

కార్డు పోగొట్టుకోవడం లేదా పాడైపోవడం వంటి సమస్య లేదు. దీనిని మొబైల్‌లో ఎల్లప్పుడూ ఉపయోగించవచ్చు. అవసరమైనప్పుడు తక్షణమే చూపించవచ్చు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఇప్పుడు రేషన్ కార్డుకు సంబంధించిన అన్ని అప్‌డేట్‌లు మొబైల్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. మీతో కాగితపు పత్రాలను తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు.

మీ ఫోన్‌లో ఉమాంగ్ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకుని కూడా రేషన్ వివరాలను అందులో చూసుకోవచ్చు. ఉమాంగ్ యాప్‌కి వెళ్లి రేషన్ కార్డ్ అని వెతకండి. మీ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ ఎంపికను ఎంచుకోండి. రేషన్ కార్డు నంబర్ నమోదు చేయండి. ఆ తర్వాత రేషన్ కార్డుకు సంబంధించిన వివరాలు మీరు అందులో చూసుకోవచ్చు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe