తెలంగాణలో ఇప్పుడు మెుత్తం స్మార్ట్ రేషన్ కార్డులే. ఇప్పటికే దాదాపుగా అందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చేశాయి. అయితే కుటుంబ యజమాని పేరు ఉండి.. మిగతా వారి పేర్లు కనిపించడం లేదని కంగారు పడుతున్నారు. కానీ మీరు ఇదే స్మార్ట్ రేషన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందులో ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్‌తో కూడిన వివరాలు కూడా ఉంటాయి. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్లినప్పుడు.. మీ ఫోన్ నుంచి దానిని జిరాక్స్ తీసి ఇచ్చేస్తే సరిపోతుంది. స్మార్ట్ రేషన్ కార్డు ఫోన్‌లో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూడండి.

తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న నూతన స్మార్ట్ రేషన్ కార్డుల ప్రక్రియ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90 శాతం వరకు పూర్తయింది. కుటుంబ సభ్యుల వివరాలు స్మార్ట్ రేషన్ కార్డులో కనిపించడం లేదని కొందరి ఆందోళన. అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ వద్ద స్మార్ట్‌ఫోన్ ఉంటే ఇంట్లో కూర్చునే సరైన వివరాలతో కూడిన కార్డును ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
T-Ration యాప్ ద్వారా కొత్త స్మార్ట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీ స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్ ప్లేస్టోర్ (Google Play Store) ఓపెన్ చేసి T-Ration అధికారిక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ అవసరం. యాప్ ఓపెన్ చేశాక మీ ఆధార్ సంఖ్యను ఎంటర్ చేయండి. మీ ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేసి లాగిన్ అవ్వండి.
అందులో Scan Smart RC ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీకు ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ కార్డు మీదున్న బార్‌కోడ్‌ను ఫోన్ కెమెరాతో స్కాన్ చేయండి. digital verification of smart card అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. పైన డౌన్లోడ్ సింబల్ ఉంటుంది. స్మార్ట్ రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇక మీ కుటుంబ వివరాలతో కూడిన కార్డును కూడా డౌన్లోడ్ చేయవచ్చు. స్మార్ట్ రేషన్ కార్డు కిందనే.. want to see family details? అని ఉండి పక్కన YES అని ఉంటుంది. ఎస్ మీద క్లిక్ చేయగానే.. ఫ్యామిలీ వివరాలతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డు కనిపిస్తుంది. దాని పైన ఉన్న సింబల్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి.
{{/usCountry}}ఇక మీ కుటుంబ వివరాలతో కూడిన కార్డును కూడా డౌన్లోడ్ చేయవచ్చు. స్మార్ట్ రేషన్ కార్డు కిందనే.. want to see family details? అని ఉండి పక్కన YES అని ఉంటుంది. ఎస్ మీద క్లిక్ చేయగానే.. ఫ్యామిలీ వివరాలతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డు కనిపిస్తుంది. దాని పైన ఉన్న సింబల్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి.
{{/usCountry}}ప్రభుత్వం పంపిణీ చేసిన ఈ స్మార్ట్ రేషన్ కార్డులను నకిలీవి సృష్టించకుండా, ట్యాంపరింగ్ చేయడానికి వీలులేకుండా అత్యంత భద్రతా ప్రమాణాలతో తయారు చేశారు. కార్డుకు రెండు వైపులా మధ్య భాగంలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నం వాటర్‌మార్క్ రూపంలో ఉంటుంది. ఇది కేవలం వెలుతురుకు ఎదురుగా చూసినప్పుడు మాత్రమే కనిపిస్తుంది.
కార్డు ముందు భాగంలో యూవీ లైట్ వేసినప్పుడు మాత్రమే మెరిసే ప్రత్యేక తెలంగాణ ఎంబ్లెమ్ అమర్చారు. సాధారణ కంటికి ఇది కనిపించదు. అనుమానం వచ్చినప్పుడు అధికారులు దీనిని తనిఖీ చేస్తారు. కార్డు వెనక భాగంలో అమర్చిన క్యూఆర్ కోడ్‌ను కేవలం పౌరసరఫరాల శాఖ అందించే ప్రత్యేక స్కానర్లు, సాఫ్ట్‌వేర్ ద్వారా మాత్రమే రీడ్ చేయగలరు.