మీ కొత్త స్మార్ట్ రేషన్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఫ్యామిలీ మెంబర్స్‌ డీటెయిల్స్‌తోపాటుగా

Smart Ration Card Download : తెలంగాణలో అర్హులైన అందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు దాదాపుగా పంపిణీ చేసింది ప్రభుత్వం. అయితే లబ్ధిదారులు వాటిని ఫోన్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Published on: Oct 2, 2026, 11:39:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తెలంగాణలో ఇప్పుడు మెుత్తం స్మార్ట్ రేషన్ కార్డులే. ఇప్పటికే దాదాపుగా అందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చేశాయి. అయితే కుటుంబ యజమాని పేరు ఉండి.. మిగతా వారి పేర్లు కనిపించడం లేదని కంగారు పడుతున్నారు. కానీ మీరు ఇదే స్మార్ట్ రేషన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందులో ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్‌తో కూడిన వివరాలు కూడా ఉంటాయి. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్లినప్పుడు.. మీ ఫోన్ నుంచి దానిని జిరాక్స్ తీసి ఇచ్చేస్తే సరిపోతుంది. స్మార్ట్ రేషన్ కార్డు ఫోన్‌లో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూడండి.

స్మార్ట్ రేషన్ కార్డులు డౌన్‌లోడ్
స్మార్ట్ రేషన్ కార్డులు డౌన్‌లోడ్

తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న నూతన స్మార్ట్ రేషన్ కార్డుల ప్రక్రియ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90 శాతం వరకు పూర్తయింది. కుటుంబ సభ్యుల వివరాలు స్మార్ట్ రేషన్ కార్డులో కనిపించడం లేదని కొందరి ఆందోళన. అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ వద్ద స్మార్ట్‌ఫోన్ ఉంటే ఇంట్లో కూర్చునే సరైన వివరాలతో కూడిన కార్డును ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

T-Ration యాప్ ద్వారా కొత్త స్మార్ట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీ స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్ ప్లేస్టోర్ (Google Play Store) ఓపెన్ చేసి T-Ration అధికారిక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ అవసరం. యాప్ ఓపెన్ చేశాక మీ ఆధార్ సంఖ్యను ఎంటర్ చేయండి. మీ ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేసి లాగిన్ అవ్వండి.

అందులో Scan Smart RC ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీకు ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ కార్డు మీదున్న బార్‌కోడ్‌ను ఫోన్ కెమెరాతో స్కాన్ చేయండి. digital verification of smart card అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. పైన డౌన్లోడ్ సింబల్ ఉంటుంది. స్మార్ట్ రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఇక మీ కుటుంబ వివరాలతో కూడిన కార్డును కూడా డౌన్లోడ్ చేయవచ్చు. స్మార్ట్ రేషన్ కార్డు కిందనే.. want to see family details? అని ఉండి పక్కన YES అని ఉంటుంది. ఎస్ మీద క్లిక్ చేయగానే.. ఫ్యామిలీ వివరాలతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డు కనిపిస్తుంది. దాని పైన ఉన్న సింబల్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి.

ప్రభుత్వం పంపిణీ చేసిన ఈ స్మార్ట్ రేషన్ కార్డులను నకిలీవి సృష్టించకుండా, ట్యాంపరింగ్ చేయడానికి వీలులేకుండా అత్యంత భద్రతా ప్రమాణాలతో తయారు చేశారు. కార్డుకు రెండు వైపులా మధ్య భాగంలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నం వాటర్‌మార్క్ రూపంలో ఉంటుంది. ఇది కేవలం వెలుతురుకు ఎదురుగా చూసినప్పుడు మాత్రమే కనిపిస్తుంది.

కార్డు ముందు భాగంలో యూవీ లైట్ వేసినప్పుడు మాత్రమే మెరిసే ప్రత్యేక తెలంగాణ ఎంబ్లెమ్ అమర్చారు. సాధారణ కంటికి ఇది కనిపించదు. అనుమానం వచ్చినప్పుడు అధికారులు దీనిని తనిఖీ చేస్తారు. కార్డు వెనక భాగంలో అమర్చిన క్యూఆర్ కోడ్‌ను కేవలం పౌరసరఫరాల శాఖ అందించే ప్రత్యేక స్కానర్లు, సాఫ్ట్‌వేర్ ద్వారా మాత్రమే రీడ్ చేయగలరు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More