...
...
Next Story

Voter Card Address Change : కొత్త ప్రాంతానికి మారారా..? ఓటర్ కార్డులో మీ అడ్రస్ ఇలా మార్చుకోవచ్చు..!

Telangana Voter Card Address Change : కొత్త ప్రాంతాలకు మారిన ఓటర్లు తమ కార్డులో చిరునామాను సులభంగా మార్చుకోవచ్చు. ఇందుకోసం జూలై 31 నుంచి ఫామ్-8 ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.

Published on: Jun 26, 2026 04:45 PM IST
Advertisement

Telangana Voter Card Address Change : రాష్ట్రంలో ఉద్యోగ, వ్యాపార లేదా ఇతర కారణాల వల్ల ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఇళ్లు మారిన ఓటర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEO) కార్యాలయం కీలక సమాచారాన్ని అందించింది. కొత్త నివాస ప్రాంతానికి మారినప్పుడు ఓటర్ కార్డులో చిరునామాను ఎలా అప్‌డేట్ చేసుకోవాలో వివరిస్తూ స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్థానికంగా వినియోగించుకునేలా ఈ ప్రక్రియను సరళతరం చేశారు.

జూలై 31 నుంచి దరఖాస్తుల స్వీకరణ

కొత్త ప్రాంతానికి మారారా..? ఓటర్ కార్డులో చిరునామా ఇలా మార్చుకోవచ్చు..!
కొత్త ప్రాంతానికి మారారా..? ఓటర్ కార్డులో చిరునామా ఇలా మార్చుకోవచ్చు..!

ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం….. రాబోయే ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 2026 జూలై 31న ముసాయిదా ఓటరు జాబితాను (Draft Voter List) అధికారులు ప్రచురిస్తారు. ఈ జాబితా విడుదలైన వెంటనే ఓటర్లు తమ చిరునామా మార్పుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత సాధిస్తారు.

'ఫామ్ 8' తప్పనిసరి

కొత్త ప్రదేశానికి మారిన ఓటర్లు తమ అడ్రస్ అప్‌డేట్ చేసుకోవడం కోసం ప్రత్యేకంగా 'ఫామ్ 8' (Form 8) ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫారమ్‌ను నింపి సంబంధిత నియోజకవర్గ ని ERO లేదా బూత్ స్థాయి అధికారికి (BLO) సమర్పించవచ్చు. ఆన్‌లైన్‌లో ఓటర్ల సేవల పోర్టల్ లేదా ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా కూడా ఈ ఫామ్-8ను సులభంగా పూర్తి చేయవచ్చు.

క్లెయిమ్‌లు, అభ్యంతరాల గడువు….

ఓటర్లు సమర్పించే ఈ ఫామ్-8 దరఖాస్తులను అధికారులు క్లెయిమ్‌లు మరియు అభ్యంతరాల కాలంలో క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఈ పరిశీలన ప్రక్రియ 2026 జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు కొనసాగుతుంది. ఈ గడువులోగా వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో ధృవీకరించిన అనంతరం, ఓటరు కొత్త చిరునామాను అధికారులు ఆమోదిస్తారు. ఈ మార్పులన్నీ ఆ తర్వాత విడుదల చేసే తుది ఓటరు జాబితాలో నిక్షిప్తం చేస్తారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe