తెలంగాణలో కొత్త వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లను(HSRP) అమర్చడంలో, వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేయడంలో విఫలమైన వాహన డీలర్లు.. ట్రేడ్ సర్టిఫికేట్ల సస్పెన్షన్, వాహన్ పోర్టల్ యాక్సెస్‌తో సహా కఠిన చర్యలను ఎదుర్కొంటున్నారు. వాహన్ పోర్టల్ ద్వారా నమోదైన 6,10,330 వాహనాల్లో 1,54,032 వాహనాలకు హెచ్ఎస్ఆర్పీ(HSRP) అమర్చే ప్రక్రియ పెండింగ్‌లో ఉందని రవాణా శాఖ గుర్తించింది. డీలర్లు 4,56,298 వాహనాలకు ప్లేట్లను అమర్చి, వివరాలను అప్లోడ్ చేశారు.

HSRP వివరాలను అప్డేట్ చేయడంలో జాప్యం కారణంగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల(RC) ప్రింటింగ్ కూడా నిలిచిపోతోందని, ఇది వాహన యజమానులకు అసౌకర్యం కలిగిస్తోందని అధికారులు తెలిపారు. HSRP లేని వాహనాలు సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్, 1989లోని రూల్ 50ని, అలాగే రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) జారీ చేసిన మార్గదర్శకాలను కూడా ఉల్లంఘించినట్టే గుర్తిస్తారు.
డిసెంబర్ 4, 2018న నోటిఫై చేసిన రూల్ 50 సవరణ ప్రకారం, ఏప్రిల్ 1, 2019 నుండి తయారు చేసిన వాహనాలతో పాటు తయారీదారులు HSRPని డీలర్లకు సరఫరా చేయాలి. ప్లేట్లపై రిజిస్ట్రేషన్ నంబర్లను ముద్రించి, వాటిని వాహనాలకు అతికించే బాధ్యత డీలర్లదే. పెండింగ్‌లో ఉన్న కేసులను డీలర్ల వారీగా సమీక్షించి, ఏడు రోజుల్లోగా గుర్తులను అతికించే ప్రక్రియను పూర్తి చేయాలి. వాహన్ పోర్టల్‌లో వివరాలను తెలియజేయాలని సంబంధిత డీలర్లకు సూచించాలని సంబంధిత శాఖ రిజిస్ట్రేషన్ అధికారులను ఆదేశించింది.
నిబంధనలను పాటించని డీలర్లకు షో-కాజ్ నోటీసులు జారీ చేస్తారు. జరిమానాలు మత్రమే కాదు.. ట్రేడ్ సర్టిఫికేట్ల సస్పెన్షన్, వాహన్ లాగిన్లను బ్లాక్ సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. తమ HSRP లేదా RC కార్డులు అందుకోని వాహన యజమానులు తమ డీలర్లను లేదా సమీపంలోని ప్రాంతీయ రవాణా ప్రాధికార సంస్థ కార్యాలయాన్ని సంప్రదించాలి.
తెలంగాణలో వాహన్ పోర్టల్ ద్వారా 6,10,330 వాహనాలు నమోదు కాగా, వాటిలో 1,54,032 వాహనాలకు ఇంకా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (HSRP) అందాల్సి ఉంది. డీలర్లు 4,56,298 వాహనాలపై హెచ్ఎస్ఆర్పీలను అతికించి.. ఆ వివరాలను వాహన్ పోర్టల్‌లో అప్లోడ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న హెచ్ఎస్ఆర్పిలను అతికించి, వాహన్‌లో వాహన వివరాలను అప్డేట్ చేయడానికి డీలర్లకు ఏడు రోజుల గడువు ఇచ్చారు.
{{/usCountry}}తెలంగాణలో వాహన్ పోర్టల్ ద్వారా 6,10,330 వాహనాలు నమోదు కాగా, వాటిలో 1,54,032 వాహనాలకు ఇంకా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (HSRP) అందాల్సి ఉంది. డీలర్లు 4,56,298 వాహనాలపై హెచ్ఎస్ఆర్పీలను అతికించి.. ఆ వివరాలను వాహన్ పోర్టల్‌లో అప్లోడ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న హెచ్ఎస్ఆర్పిలను అతికించి, వాహన్‌లో వాహన వివరాలను అప్డేట్ చేయడానికి డీలర్లకు ఏడు రోజుల గడువు ఇచ్చారు.
{{/usCountry}}వాహనాల భద్రతను పెంచడం, వాహన దొంగతనాలను అరికట్టడం లక్ష్యంగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేన్ ప్లేట్ విధానం తీసుకొచ్చారు. హెచ్ఎస్ఆర్పీ అనేది వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్‌ను ఒకే విధమైన ప్రమాణాలతో ప్రదర్శించే ప్రత్యేక నెంబర్ ప్లేట్. అల్యూమినియంతో వీటిని తయారుచేస్తారు. వీటి మీద రిఫ్లెక్టివ్ షీటింగ్ ఉంటుంది.
ABOUT THE AUTHOR
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.