JEE Mains 2027 : అలర్ట్! జేఈఈ మెయిన్స్ 2027 సెషన్ 1 రిజిస్ట్రేషన్​కు ఈరోజే లాస్ట్ ఛాన్స్..

దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే 'జేఈఈ మెయిన్స్ 2027' సెషన్-1 సాధారణ దరఖాస్తు గడువు నవంబర్ 22తో ముగియనుంది. ఇప్పటివరకు 13.29 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. ఆలస్య రుసుము తేదీలు, పరీక్షల షెడ్యూల్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

Published on: Nov 22, 2026, 06:46:13 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ఇంజనీరింగ్ సీటు సాధించాలని కలలు కంటున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్. 'జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ 2027' సెషన్-1 పరీక్షకు సంబంధించిన సాధారణ రిజిస్ట్రేషన్ గడువు నేటితో (నవంబర్ 22, 2026) ముగియనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు మొత్తం 13,29,670 దరఖాస్తు ఫారమ్‌లు సమర్పించారు. వీటిలో 11,19,062 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి పరీక్ష రుసుమును కూడా చెల్లించారు.

జేఈఈ మెయిన్స్ 2027 లేటెస్ట్ అప్డేట్స్..
జేఈఈ మెయిన్స్ 2027 లేటెస్ట్ అప్డేట్స్..

ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ద్వారా వెంటనే ఫారమ్ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

జేఈఈ మెయిన్స్ 2027 సెషన్ 1- గడువు దాటితే ఆలస్య రుసుము..

జేఈఈ మెయిన్స్ 2027 సెషన్ 1 రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన తర్వాత ఎలాంటి సాధారణ దరఖాస్తులను స్వీకరించబోమని ఎన్టీఏ స్పష్టం చేసింది. అయితే ఏదైనా కారణం చేత ఈ గడువును మిస్ అయిన అభ్యర్థుల కోసం ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. నవంబర్ 23 నుంచి 26, 2026 వరకు లేట్ ఫీజు చెల్లించి జేఈఈ మెయిన్స్ సెషన్-1 కోసం అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తిగా ముగిసిన తర్వాత, ఫారమ్‌లలో ఏవైనా తప్పులు దొర్లితే సరిదిద్దుకోవడానికి ఎన్టీఏ అవకాశం ఇస్తోంది. నవంబర్ 27 నుంచి 29, 2026 వరకు అప్లికేషన్ కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుంది. ఈ మూడు రోజుల వ్యవధిలో అభ్యర్థులు తమ వివరాలను సవరించుకోవచ్చు.

జేఈఈ మెయిన్స్ 2027 సెషన్-1 దరఖాస్తు విధానం ఇదే..

ఇప్పటివరకు దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయని అభ్యర్థులు కింది దశలను అనుసరించి తమ ఫారమ్‌ను సమర్పించవచ్చు:

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ఓపెన్ చేయండి.
  • హోమ్‌పేజీలో కనిపించే "Online Application Form for JEE Main 2027- Session 1" లింక్‌పై క్లిక్ చేయండి.
  • అవసరమైన ప్రాథమిక వివరాలు ఇచ్చి కొత్త రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
  • మీకు వచ్చిన అప్లికేషన్ క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అయి, వ్యక్తిగత, విద్యార్హత వివరాలను జాగ్రత్తగా నింపండి.
  • పాస్‌పోర్ట్ సైజు ఫొటో, సంతకం వంటి అవసరమైన పత్రాలను నిర్దిష్ట సైజులో అప్‌లోడ్ చేయండి.
  • చివరగా ఆన్‌లైన్ ద్వారా పరీక్ష రుసుము చెల్లించి ఫారమ్ సబ్మిట్ చేయండి. భవిష్యత్ అవసరాల కోసం కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసి భద్రపరుచుకోండి.

జేఈఈ మెయిన్స్ 2027 సెషన్ 1 పరీక్ష తేదీలు, అడ్మిట్ కార్డులు..

జేఈఈ మెయిన్స్ 2027 సెషన్ 1కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఎన్టీఏ ప్రకటించింది:

  • సిటీ ఇంటిమేషన్ స్లిప్ (పరీక్షా కేంద్రం నగరం వివరాలు): డిసెంబర్ 30, 2026
  • అడ్మిట్ కార్డుల విడుదల తేదీ: జనవరి 13, 2027
  • పరీక్ష జరిగే తేదీలు: జనవరి 20, 21, 22, 23, 24, 28, 2027

తెలుగు, ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, ఉర్దూ సహా మొత్తం 13 భాషల్లో ఈ జేఈఈ మెయిన్స్ 2027 పరీక్షను నిర్వహిస్తారు. తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు సైతం మాతృభాషలోనే ప్రశ్నపత్రం అందుబాటులో ఉండటం పెద్ద ఊరట.

కాగా చివరి నిమిషంలో సర్వర్ రద్దీ సమస్యలు తలెత్తకుండా అభ్యర్థులు తక్షణమే జేఈఈ మెయిన్స్ 2027 సెషన్ 1 రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడం ఉత్తమం.

జేఈఈ మెయిన్స్​ పరీక్షను ఎన్టీఏ ప్రతీ యేటా రెండుసార్లు నిర్వహిస్తుందన్న విషయం తెలిసిందే. ఇందులో మంచి ర్యాంకు సాధించిన వారు జేఈఈ అడ్వాన్స్​డ్​కు అర్హత సాధిస్తారు. అందులో ఉత్తమ ప్రదర్శన చేసిన వారు ఐఐటీల్లో చేరుతారు.

ABOUT THE AUTHOR

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.