Real Estate Scam : హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ భారీ స్కామ్.. ప్రాజెక్ట్ మొదలు కాకముందే కోట్లలో మోసం

Real Estate Scam : హైదరాబాద్‌లో భారీ రియల్ ఎస్టేట్ మోసం బయటపడింది. ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నట్టు ముందుగానే ప్రచారం చేసి డబ్బులు దండుకున్నారు.

Updated on: Mar 05, 2026 10:45 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్‌లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రియల్ ఎస్టేట్ పేరుతో కొందరు కోట్లు దండుకున్నారు. ఈ ఘటనలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అపార్ట్‌మెంట్ నిర్మాణాల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేశారు. కస్టమర్లను నమ్మించి.. భారీగా డబ్బులు వసూలు చేశారు.

రియల్ ఎస్టేట్ మోసం
రియల్ ఎస్టేట్ మోసం

త్రిపుర కన్స్ట్రక్షన్స్ వ్యవస్థాపకులు, డైరెక్టర్లపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో కొంతమంది వ్యక్తులను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. త్రిపుర కన్స్ట్రక్షన్ సంస్థ డైరెక్టర్ పసుపులేటి సుధాకర్‌‌తోపాటుగా ఆయన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు.

త్రిపుర కన్స్ట్రక్షన్ సంస్థ గత కొన్ని ఏళ్లుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్ ప్రారంభిస్తున్నట్టుగా ప్రచారం చేసిందని పోలీసులు తెలిపారు. కస్టమర్లను ఆకర్శించడానికి అనేక రకాల ప్రకటనలు విడుదల చేశారు. తక్కువ ధరలో ఫ్లాట్లు అందిస్తామని చెప్పుకొచ్చారు. ఈ ప్రకటనలు నమ్మి.. చాలా మంది పెట్టుబడి పెట్టారు. కంపెనీ ముందుగానే భారీగా అడ్వాన్స్‌లు వసూలు చేసినట్టుగా బాధితులు పేర్కొన్నారు. ఇక టైమ్ దాటిపోయినా... ఫ్లాట్లు ఇవ్వలేదు. డబ్బులు తిరిగి ఇవ్వమన్నా ఇవ్వకుండా దాటేశారు.

దీంతో బాధితులు పోలీసుల దగ్గరకు వెళ్లారు. కోట్ల రూపాయలు చెల్లించామని చెప్పారు. కానీ ఫ్లాట్ గానీ, డబ్బులు గానీ.. ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. భారీగా డబ్బులు సేకరించినట్టుగా గుర్తించారు. అయితే ప్రాజెక్టులు పూర్తి చేసి ఇవ్వలేదు సరికదా.. మళ్లీ ఆకర్శించేందుకు ప్రచారం చేసినట్టుగా తెలిసింది. దీంతో ఈ కేసులో పసుపులేటి సుధాకర్‌తోపాటుగా ఆయన భార్య, మరికొందరిని అరెస్ట్ చేశారు.

బాధితుల్లో ఒకరైన వినోద్ 2022 నవంబర్‌లో సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్‌లో త్రిపుర కన్స్ట్రక్షన్స్ ద్వారా భాగస్వామి పసుపులేటి సుగుణ, ఆమె భర్త, వ్యవస్థాపక ఛైర్మన్ పసుపులేటి సుధాకర్, శివ కృష్ణ, పల్లవి కృష్ణలతో కలిసి ప్రీ-లాంచ్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్నట్లు చెప్పారు. ప్రాజెక్ట్ మూడు సంవత్సరాలలోపు పూర్తవుతుందని హామీ ఇచ్చారు. వారి హామీలను నమ్మి, 2,200 చదరపు అడుగుల ఫ్లాట్‌ను రూ.77 లక్షలకు కొనుగోలు చేయడానికి ఏప్రిల్ 2023లో ఒప్పందం కుదుర్చుకుని ఆ మొత్తాన్ని చెల్లించారు వినోద్.

అయితే, కంపెనీ నిర్మాణాన్ని ప్రారంభించలేదు, అనుమతులు పొందలేదు. పదేపదే అభ్యర్థించినప్పటికీ ఫ్లాట్ కేటాయించడంలో లేదా డబ్బును తిరిగి చెల్లించడంలో విఫలమైందని తెలిపాడు. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించాడు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More