మేడారం జాతర వైభవంగా కొనసాగుతోంది. ఇప్పటికే సారలమ్మ గద్దెపైకి రాగా… గురువారం సమ్మక్క కొలువుదీరింది. సమ్మక్క అమ్మవారు గద్దెకు చేరుకుంటున్న వేళ…. భక్తులు భారీగా తరలివచ్చరు.

చిలకలగట్టు కంకవనం నుంచి జనంలోకి సమ్మక్క తల్లి ఆగమనం చేసింది. శుభసుచకంగా జిల్లా ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపారు. కుంకుమ భరణి సమ్మక్క ప్రతి రూపాన్ని పూజారులు గద్దెలపైకి తీసుకుని వచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, , జిల్లా కలెక్టర్ దివాకర్ స్వాగతం పలికారు.
ఇప్పటికే గద్దెలపై సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు కొలువుదీరారు. వన దేవతలు రాక వేళ శివసత్తులు అడుగడుగునా పూనకాలతో ఊగిపోయారు. మూడు అంచెల భద్రత నడుమ వన దేవతలను గద్దెల మీదకు తీసుకొచ్చారు. గద్దెలపై కొలువుదీరిన వన దేవతలను భక్తులు దర్శించకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
సమ్మక్క రాక సమయంలో భక్తులు తాకేందుకు ప్రయత్నించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా నాలుగు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీతో పాటు పలువురు ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
మహా జాతరలో సమ్మక రాక వేళ డోలు వాయిద్యాలు, ఎదురుకోళ్లతో భక్తులు అత్యంత ఘనంగా స్వాగతం పలికారు.ఈ నెల 31 వరకు మేడారం జాతర కొనసాగనుంది. భక్తుల రద్దీ రోజురోజుకూ మరింత పెరగుతోంది.
{{/usCountry}}మహా జాతరలో సమ్మక రాక వేళ డోలు వాయిద్యాలు, ఎదురుకోళ్లతో భక్తులు అత్యంత ఘనంగా స్వాగతం పలికారు.ఈ నెల 31 వరకు మేడారం జాతర కొనసాగనుంది. భక్తుల రద్దీ రోజురోజుకూ మరింత పెరగుతోంది.
{{/usCountry}}