కవాడిగూడలో స్పా సెంటర్‌లోకి చొరబడి భార్యను కత్తితో నరికి చంపిన భర్త.. ఆ తర్వాత!

హైదరాబాద్ కవాడిగూడలో దారణమైన ఘటన జరిగింది. పట్టపగలే భార్యపై కత్తితో దాడి చేసి దారుణంగా చంపేశాడు ఒక భర్త.

Published on: May 19, 2026, 15:28:11 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ నగరంలో మంగళవారం ఒక ఘోర హత్య కలకలం రేపింది. కట్టుకున్న భార్యపై ఉన్న కోపంతో, ఆమె పనిచేస్తున్న చోటికే వెళ్లిన ఒక భర్త.. కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి అతి కిరాతకంగా చంపేశాడు. స్పా సెంటర్‌లోకి చొరబడి ఈ ఘాతుకానికి ఒడిగట్టడం స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది.

కవాడిగూడ హత్య
కవాడిగూడ హత్య

అసలేం జరిగింది?

పోలీసుల కథనం ప్రకారం.. బహదూర్‌పూర్‌ పరిధిలోని కిషన్‌బాగ్‌‌లో నివసిస్తున్న బంగి దేబోరా అనే మహిళ కవాడిగూడలోని ఒక ప్రముఖ స్పా సెంటర్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. గత కొంతకాలంగా దేబోరా, ఆమె భర్త మధ్య కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. రోజూలాగే మంగళవారం ఉదయం కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపానికి గురైన దేబోరా, ఆ గొడవను పక్కనబెట్టి తన విధులకు హాజరయ్యేందుకు కవాడిగూడలోని స్పా సెంటర్‌కు వచ్చేసింది.

స్పా సెంటర్‌లోనే దారుణ హత్య

భార్య తనతో గొడవపడి వెళ్లడాన్ని తట్టుకోలేకపోయిన భర్త, ఆమెపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. ఎలాగైనా ఆమెను అంతమొందించాలనే పగతో కత్తితో కవాడిగూడకు బయలుదేరాడు.

కవాడిగూడ రత్నదీప్ బిల్డింగ్‌లోని నాల్గో అంతస్తులో ఉన్న స్పా సెంటర్‌కు చేరుకున్న నిందితుడు, ఒక్కసారిగా లోపలికి చొరబడ్డాడు. అక్కడ పనిచేస్తున్న దేబోరాపై తను వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె తేరుకునే లోపే కత్తితో పలుమార్లు పొడవడంతో, తీవ్ర రక్తస్రావమై దేబోరా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్పాలోని ఇతర సిబ్బంది భయంతో కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

హత్య చేసిన అనంతరం పోలీస్ స్టేషన్‌లో లొంగుబాటు

కవాడిగూడలో భార్యను దారుణంగా హత్య చేసిన అనంతరం నిందితుడు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు.

మరోవైపు సమాచారం అందుకున్న గాంధీనగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు ప్రధాన కారణమని భావిస్తున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని నిందితుడిని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. పట్టపగలే కవాడిగూడ లాంటి రద్దీ ప్రాంతంలో ఈ దారుణం జరగడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More